కాన్పూర్: ఓ మహిళా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న కారు ఓ యువకున్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 35 ఏళ్ల మదన్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆమె, ఆ కారులో ప్రయాణిస్తున్న మరొకరు వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఎక్కడ ఈ కేసు వాళ్ల మెడకు చుట్టుకుంటుదో అని పోస్టుమార్టం పూర్తి కాకముందే అతని మృతదేహాన్ని ఖననం చేశారు.
కాగా ఆలస్యంగా సమాచారం తెలుసుకున్న బాధితుడి బంధువులు రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వకుండానే, పోస్టుమార్టం కూడా జరగకముందే మృతదేహాన్ని పూడ్చిపెట్టారని ఆరోపించారు. దీంతో వారం రోజుల కింద చోటు చేసుకున్న ఈ సంఘటనలో ప్రమేయమున్న ఆనంద్ పురి మహిళా హెడ్ కానిస్టేబుల్ వర్షా శ్రీవాస్తవ్ పై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్టు బుధవారం కాన్పూర్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మంగళవారం మదన్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపించామని పోలీసులు తెలిపారు.
మహిళా కానిస్టేబుల్ ఘాతుకం..
Published Wed, Dec 9 2015 3:51 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement