
ప్రతీకాత్మక చిత్రం
Tamil Nadu man returns home alive: కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమేనా? లేక కల అనిపిస్తుంది. కళ్లతో చూస్తున్నప్పటకీ ఇది నిజమేనా అని సందేహంగా ఉండిపోతాం. పరిస్థితులు కూడా అలానే ఎదురవుతాయి. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి చనిపోయాడని భావించి ఆదివారం సాయంత్రం అతని బంధువులు ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అతను అనుహ్యంగా సజీవంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా బంధువులంతా షాక్ అయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో బనగలద్‌పూర్‌లో చోటుచేసుకుంది.
మూర్తి దినసరి కూలీ. చెరకు కోయడానికి కొన్ని రోజుల క్రితం తిరుపూర్ వెళ్లాడు. అయితే అతని కుమారుడు కార్తిక్‌కి.. మూర్తి ఓ బస్టాప్‌లో చనిపోయినట్లు బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతను సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి తన తండ్రేనని గుర్తించాడు కూడా. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అంతేగాదు ఆ మృతదేహానికి ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు కూడా. ఇదిలా ఉండగా 24 గంటల తర్వాత కార్తిక్ వాళ్ల నాన్న మూర్తి అనుహ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
దీంతో ఒక్కసారిగా కుటుంబీకులు షాక్ తిన్నారు.ఈ క్రమంతో కార్తీ మాట్లాడుతూ..‘‘మా నాన్న మరణ వార్త విని చాలా షాక్ అయ్యాను. ఇప్పుడు అతను ఇంటికి రావడంతో తాను మరింత షాక్‌కి గురయ్యాను. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ అన్నాడు. కార్తీ ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించాడు. ఇప్పుడు పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరా? అని విచారణ చేయడం ప్రారంభించారు.
(చదవండి: హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ రైటర్ అరెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..)
Comments
Please login to add a commentAdd a comment