
అబుదాబి రాజును కలిసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అబుదాబి రాజును కలుసుకున్నారు. మొట్టమొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా శ్వేతసౌదానికి ఆహ్వానించి ముచ్చటించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అబుదాబి రాజును కలుసుకున్నారు. మొట్టమొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా శ్వేతసౌదానికి ఆహ్వానించి ముచ్చటించారు. త్వరలోనే ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. అబుదాబి రాజు జయద్ అల్-నయాన్ శ్వేత సౌదంలోని ఓవల్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ట్రంప్ ఆయనను సాదరంగా హ్వానిస్తూ ‘నయన్ ప్రత్యేకమైన అతిధి.. మెండుగా గౌరవించదగినవారు’ అని ఫొటో సెషన్ సందర్భంగా అన్నారు.
‘ఆయన దేశాన్ని ప్రేమిస్తున్నాను.. మీరు కూడా ఆయన దేశాన్ని ప్రేమించండి. వీటన్నింటికంటే ముందు అమెరికాను ప్రేమించండి.. మనందరికీ అదే ముఖ్యం’ అంటూ ట్రంప్ చెప్పినట్లు యూఎస్‌ఏ టుడే తెలిపింది. ఇరు దేశాల భద్రత, వాణిజ్య, ఇరు దేశాల్లో పెట్టుబడుల అంశాలపై చర్చించుకున్నారని, ద్వైపాక్షి సంబంధాలపై తీవ్రంగా చర్చిచారని కూడా అది పేర్కొంది. మరోపక్క, అమెరికా రహస్యాలను డోనాల్డ్ ట్రంప్ రష్యాకు లీక్ చేశారని వచ్చిన వార్తలను అమెరికా శ్వేతసౌదం కొట్టిపారేసింది. అవన్నీ కూడా కట్టుకథలేనంటూ తిప్పికొట్టింది.