
ఐశా మహమ్మద్ మషీత్ అల్ మజ్‌రౌవీతో అబుదాబీ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్
అబుదాబి : అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కొద్దిరోజుల క్రితం ఓ విందులో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అతని షేక్‌హ్యాండ్ కోసం బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి పరుగు పరుగున వచ్చి ఆ లైన్‌లో నిలబడింది. అతని కోసం చేతులు ముందుకు చాచి ఆతృతగా ఎదురు చూడసాగింది. అందరికీ చిరునవ్వుతో కరచాలనం చేస్తూ వచ్చిన యువరాజు చివరకు ఆ చిన్నారికి షేక్‌హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు.
దీంతో బాలిక తీవ్ర నిరాశకు గురైంది. తనవంతు రాగానే యువరాజు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదని ఎంతగానో బాధపడింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వెంటనే ఆ యువరాజు చిన్నారి ఐశా మహమ్మద్ మషీత్ అల్ మజ్‌రౌవీ ఇంటికి వెళ్లి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. చిన్నారితో కరచాలనం చేయడమే కాకుండా నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. దీంతో బాలిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యువరాజుది గొప్ప మనసు అంటూ ఆయన చేసిన పనికి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment