పిల్లవాడి దగ్గర నేర్చుకున్న ఐఐటి విద్యార్థులు!
అబూ దబీ : బెనారస్ ఐఐటి విద్యార్థులు వినూత్న పోరాటం చేస్తున్నారు. కాశీ కేంద్రంగా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేడ్స్ (యూఏఈ) రాజధాని అబూ దబీ నగరంలో ఉంటున్న ఓ భారతీయ బాలుడిని ఆదర్శంగా తీసుకొని దాదాపు పది వేల మంది విద్యార్థులు ఈ ఉద్యమం చేపట్టారు. 5 లక్షల కాగితపు సంచులు తయారు చేసి కాశీలో పంపిణీ చేయాలని ఈ విద్యార్థులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
అబ్దుల్ ముఖీట్ అనే 13 ఏళ్ల బాలుడు ఇక్కడ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేపట్టాడు. 8 గ్రేడ్ చదువుతున్న ఈ విద్యార్థి అనేక అవార్డులు గెలుచుకున్నాడు. ఈ బాలుడు చేపట్టిన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం, కాగితపు బ్యాగుల తయారు చేయడానికి చేస్తున్న కృషిని వీడియోలో చూసి తాము ఉత్తేజితులమైనట్లు ఐఐటి విద్యార్థులు తెలిపారు.
ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమ ప్రచారానికి అబ్దుల్ ముఖీట్ బ్యాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి తాము గర్వపడుతున్నట్లు ఐఐటి విద్యార్థులు చెప్పారు. ఈ ఉద్యమం ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి అబ్దుల్ ముఖీట్ గురువారం బెనారస్ వెళుతున్నాడు.
**