IIT Banaras Students
-
బెనారస్ ఐఐటీలో విద్యార్థినిపై దురాగతం
వారణాసి: ఐఐటీ–బీహెచ్‌యూ(బెనారస్ హిందూ యూనివర్సిటీ) విద్యార్థినిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు విద్యార్థినిని వేధించడంతోపాటు బట్టలు విప్పించి, వీడియో చిత్రీకరించారు. బాధిత విద్యార్థిని బుధవారం రాత్రి స్నేహితుడితో కలిసి హాస్టల్‌కు సమీపంలోని కర్మన్‌బాబా ఆలయం వద్దకు వెళ్లింది. అప్పుడే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. బాధితురాలిని బలవంతంగా ఓ మూలకు తీసుకెళ్లి వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను బట్టలూడదీయించి, వీడియో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. 15 నిమిషాల అనంతరం ఆమె సెల్ నంబర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ అమానుషంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
పిల్లవాడి దగ్గర నేర్చుకున్న ఐఐటి విద్యార్థులు!
అబూ దబీ : బెనారస్ ఐఐటి విద్యార్థులు వినూత్న పోరాటం చేస్తున్నారు. కాశీ కేంద్రంగా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేడ్స్ (యూఏఈ) రాజధాని అబూ దబీ నగరంలో ఉంటున్న ఓ భారతీయ బాలుడిని ఆదర్శంగా తీసుకొని దాదాపు పది వేల మంది విద్యార్థులు ఈ ఉద్యమం చేపట్టారు. 5 లక్షల కాగితపు సంచులు తయారు చేసి కాశీలో పంపిణీ చేయాలని ఈ విద్యార్థులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అబ్దుల్ ముఖీట్ అనే 13 ఏళ్ల బాలుడు ఇక్కడ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేపట్టాడు. 8 గ్రేడ్ చదువుతున్న ఈ విద్యార్థి అనేక అవార్డులు గెలుచుకున్నాడు. ఈ బాలుడు చేపట్టిన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం, కాగితపు బ్యాగుల తయారు చేయడానికి చేస్తున్న కృషిని వీడియోలో చూసి తాము ఉత్తేజితులమైనట్లు ఐఐటి విద్యార్థులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమ ప్రచారానికి అబ్దుల్ ముఖీట్ బ్యాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి తాము గర్వపడుతున్నట్లు ఐఐటి విద్యార్థులు చెప్పారు. ఈ ఉద్యమం ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి అబ్దుల్ ముఖీట్ గురువారం బెనారస్ వెళుతున్నాడు. **