బెనారస్‌ ఐఐటీలో విద్యార్థినిపై దురాగతం | Protest Erupts At IIT-BHU Campus After Student Molested And Harassed By Bike Borne Men - Sakshi
Sakshi News home page

IIT-BHU Protests: బెనారస్‌ ఐఐటీలో విద్యార్థినిపై దురాగతం

Published Fri, Nov 3 2023 5:43 AM | Last Updated on Fri, Nov 3 2023 12:07 PM

Protest at IIT-BHU after student harassed - Sakshi

వారణాసి: ఐఐటీ–బీహెచ్‌యూ(బెనారస్‌ హిందూ యూనివర్సిటీ) విద్యార్థినిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు విద్యార్థినిని వేధించడంతోపాటు బట్టలు విప్పించి, వీడియో చిత్రీకరించారు. బాధిత విద్యార్థిని బుధవారం రాత్రి స్నేహితుడితో కలిసి హాస్టల్‌కు సమీపంలోని కర్మన్‌బాబా ఆలయం వద్దకు వెళ్లింది.

అప్పుడే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. బాధితురాలిని బలవంతంగా ఓ మూలకు తీసుకెళ్లి వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను బట్టలూడదీయించి, వీడియో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. 15 నిమిషాల అనంతరం ఆమె సెల్‌ నంబర్‌ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ అమానుషంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement