
అబుదాబి రాజకుటుంబీకులతో ప్రభాస్, ప్రమోద్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో చిత్రీకరణ ప్రస్తుతం అబుదాబిలో జరుగుతోంది. 50 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు, చేజ్ సీన్లు చిత్రీకరించనున్నారు. దాదాపు 200 మంది యూనిట్ సభ్యులు ఈ షూటింగ్ కోసం అబుదాబి చేరుకున్నారు. ప్రస్తుతం అబుదాబిలో ఉన్న ప్రభాస్ అక్కడి రాజకుటుంబీకులతో సమావేశమయ్యారు. రాయల్ ఫ్యామిలీకి చెందిన మహిళతో ప్రభాస్ సమావేశానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్‌తో పాటు ఆయన సోదరుడు, యూవీ క్రియేషన్స్ నిర్మాత ప్రమోద్ కూడా రాయల్ ఫ్యామిలీని కలిసిన వారిలో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment