
వంట చేస్తోన్న సల్మాన్
షూటింగ్ లేని సమయాల్లో వేరే పనులేవీ లేకుండా ఖాళీగా ఉంటే స్టార్స్ ఫన్నీగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. కొందరు గొంతు సవరించుకుని పాట పాడతారు. శ్రుతీహాసన్, సోనాక్షి సిన్హా లాంటి వారు పెయింటింగ్‌తో బిజీ అయిపోతారు. ఇంకొందరు పుస్తకంలో తలదూర్చుతారు. మరికొందరు గరిటె పడతారు. సల్మాన్ ఖాన్ మల్టీ టాలెండెడ్. పాడతారు.
అలాగే పెయింటింగ్, వంట కూడా చేస్తారు. నిన్న (ఆదివారం) సల్మాన్‌కి బాగా తీరిక చిక్కినట్లుంది. వంట చేసే పనిలో పడ్డారు. సల్మాన్ ఖాన్ వంట చేస్తున్నది ఇక్కడ కాదు.. అబుదాబిలో. ‘భారత్’ సినిమా కోసం అక్కడికి వెళ్లారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కత్రినా కైఫ్ కథానాయిక. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే.. కర్రీలో కారం సరిపోయిందా? అని సల్మాన్ ఆలోచిస్తున్నట్లు ఉంది కదూ.
Comments
Please login to add a commentAdd a comment