
సల్మాన్ ఖాన్
‘‘నా చుట్టూ ఉండేవాళ్లు తరచూ అడిగేవారు. నీ పేరేంటి? నీ కులమేంటి? మతమేంటి? అని. భారతదేశం లాంటి గొప్ప దేశం మీదున్న ప్రేమతో నాకు ‘భారత్’ అని పేరు పెట్టారు మా నాన్న. అలాంటి గొప్ప పేరు వెనుక కులం, మతాల పేర్లు అంటించేటువంటి హానికర చర్యలు చేయలేకపోయాను’’ అనే డైలాగ్స్‌తో సాగింది సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం ‘భారత్’ టీజర్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. కత్రినా కైఫ్, దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. 20 ఏళ్ల యువకుడి నుంచి 50 ఏళ్ల వృద్ధుడిగా సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కనిపిస్తారు. రంజాన్ పండగకు రిలీజ్ కానున్న ఈ చిత్రం కొరియన్ ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి రీమేక్.
Comments
Please login to add a commentAdd a comment