బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భారత్’ . కత్రినా కైఫ్, దిశా పటానీ, జాకీ ష్రాఫ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
‘నీ ఇంటిపేరు, నీ జాతి, నీ కులం, నీ మతం ఏంటి అని అందరూ నన్ను అడుగుతుంటారు. వారందరికీ చిరునవ్వుతో నేనిచ్చే సమాధానం.. మా నాన్న ఈ దేశం పేరు మీదుగా నాకు భారత్ అనే పేరు పెట్టారు. దేశ ప్రతిష్టకు మచ్చ రాకుండా నడుచుకుంటాను’ అంటూ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో సాగిన భారత్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దేశ విభజన సన్నివేశాలతో ప్రారంభమైన టీజర్‌లో.. నేవీ అధికారిగా, బైక్‌స్టంట్స్ చేసే వ్యక్తిగా, బాక్సర్‌గా సల్మాన్ కనిపించాడు. ఇక సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment