బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్నసినిమా భారత్. భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్‌ఖాన్ తన లేటెస్ట్ మూవీ భారత్ టీజర్ రిలీజ్ చేశాడు. ఇండియన్ మ్యాప్‌ను చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో సల్మాన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో టీజర్ సాగిపోతుంది.
‘కొన్ని బంధాలు మట్టితో పెనవేసుకుంటాయి.. మరికొన్ని రక్త సంబంధంతో ముడిపడి ఉంటాయి. నాకు ఆ రెండు బంధాలు ఉన్నాయి’ అన్న సల్మాన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ముగుస్తుంది. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ఈ వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో సల్మాన్ సరసన కత్రినా, దిశాపటానీలు నటిస్తున్నారు. టబు, సునిల్ గ్రోవర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే యేడాది ఈద్‌కు విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment