![544 Foot Building Demolished In 10 Seconds Creates Guinness Record - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/9/abu-dhabi.jpg.webp?itok=7tCIaqG7)
వీడియో దృశ్యాలు
అబుదాబి : ఓ పెద్ద బిల్డింగ్‌ను అతి తక్కువ సమయంలో కూల్చి ప్రపంచ రికార్డు నెలకొల్పిందో రియల్ ఎస్టేట్ సంస్థ. వివరాలు.. అబుదాబికి చెందిన మోడన్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొద్దిరోజుల క్రితం 541.44 అడుగుల సొంత బిల్డింగ్ ‘మినా ప్లాజా’ను 10 సెకన్లలో కూల్చేసింది. 4 టవర్లు, 144 ఫ్లోర్లు ఉన్న ఆ పెద్ద భవనం అతి తక్కవ సమయంలో పేకమేడలా కూలిపోయింది. దీంతో గిన్నిస్ బుక్ రికార్డ్ సంస్థ సొంతమైంది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ సంస్థ తమ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. ( ఆన్‌లైన్‌లో పెళ్లికి 2 వేల మంది అతిధులు )
దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు‘అవెంజర్స్ సినిమాలో టోనీ స్టార్క్.. హల్కుతో గొడవపడి ఎప్పుడో ఇలాంటి బిల్డింగ్‌ను కూల్చేశాడు’.. ‘అదో పిచ్చి పని’.. ‘ డబ్బుల్ని, వనరుల్ని వృధా చేస్తున్నారు’.. ‘అద్బుతంగా ఉంది’.. ‘ హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment