నాకు కరోనా పాజిటివ్‌.. మరేం ఫర్వాలేదు: టెన్నిస్‌ స్టార్‌ | Rafael Nadal Test Covid 19 Positive After Abu Dhabi Comeback Event | Sakshi
Sakshi News home page

Rafael Nadal: కరోనా బారిన పడ్డ నాదల్‌.. ట్వీట్‌తో..

Dec 20 2021 5:24 PM | Updated on Dec 20 2021 5:31 PM

Rafael Nadal Test Covid 19 Positive After Abu Dhabi Comeback Event - Sakshi

రఫేల్‌ నాదల్‌ (ఫైల్‌ ఫొటో)

నాకు కరోనా పాజిటివ్‌.. మరేం ఫర్వాలేదు: టెన్నిస్‌ స్టార్‌

Covid 19 Positive: స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ కరోనా బారిన పడ్డాడు. అబుదాబి టోర్నీలో ఆడిన నాదల్‌ స్వదేశానికి తిరిగి రాగానే నిర్వహించిన టెస్టులో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. అయితే, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు.

‘‘అబుదాబి టోర్నమెంట్‌ తర్వాత స్పెయిన్‌కు తిరిగి వచ్చాను. ఈ సందర్భంగా నిర్వహించిన పీసీఆర్‌ టెస్టులో కోవిడ్‌ సోకినట్లు నిర్దారణ అయింది. కాస్త ఇబ్బందిగా ఉంది. అయితే, కంగారు పడాల్సిందేమీ లేదు. నాతో సన్నిహితంగా మెలిగిన వాళ్లకు.. నాకు కరోనా సోకిన విషయం తెలిపాను ’’ అని నాదల్‌ పేర్కొన్నాడు.

కాగా 20 సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత అయిన నాదల్‌... కాలి గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అబుదాబి వేదికగా జరిగిన ముబదాలా వరల్డ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌తో పునరాగమనం చేశాడు. ముర్రే చేతిలో ఓటమిపాలై ఇంటిబాట పట్టాడు.

చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్‌, బట్లర్‌ పాపం..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement