భారత జట్టులో తెలంగాణ అమ్మాయిలు | India Announces Billie Jean King Cup Squad Check Telangana Athlets Names | Sakshi
Sakshi News home page

భారత జట్టులో తెలంగాణ అమ్మాయిలు

Mar 24 2026 2:34 PM | Updated on Mar 24 2026 2:48 PM

India Announces Billie Jean King Cup Squad Check Telangana Athlets Names

న్యూఢిల్లీ: బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీలో పోటీపడే భారత మహిళల టెన్నిస్‌ జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన భారత నంబర్‌వన్‌ సహజ యామలపల్లి, భారత ఐదో ర్యాంకర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

 వైష్ణవి అడ్కర్‌కు తొలిసారి పిలుపు
ఇటీవల బెంగళూరులో జరిగిన ఐటీఎఫ్‌–100 టోర్నీలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన మహారాష్ట్ర ప్లేయర్‌ వైష్ణవి అడ్కర్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 391వ ర్యాంక్‌తో సహజ భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌గా కొనసాగుతుండగా... వైష్ణవి 397వ ర్యాంక్‌తో రెండో ర్యాంకర్‌గా నిలిచింది. ఏప్రిల్‌ 7 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. 

సహజ, రష్మిక, వైష్ణవిలతోపాటు రుతుజా భోస్లే, అంకిత రైనా కూడా భారత జట్టులో ఉన్నారు. వైదేహి చౌధరీని రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కెప్టెన్‌గా విశాల్‌ ఉప్పల్, కోచ్‌గా రాధిక కనిట్కర్‌ కొనసాగుతారు. 

ఐదు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు ఇండోనేసియా, కొరియా, న్యూజిలాండ్, మంగోలియా, థాయ్‌లాండ్‌ పోటీపడతాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక టాప్‌–2లో నిలిచిన జట్లు బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ప్లే ఆఫ్స్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement