ప్రతీకాత్మకచిత్రం
దుబాయ్ : అబుదాబిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫ్లాట్‌లో భారత్‌కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మేరకు ఖలీజ్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. మృతులను కేరళ కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్ధనన్ పట్టీరీ(57), మినిజ(52) దంపతులుగా గుర్తించారు. అయితే వారి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. వీరు 18 ఏళ్ల నుంచి అబుదాబిలో నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. జనార్ధనన్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, మినిజా చార్టర్ అకౌంటెంట్‌గా ఉన్నారు. అయితే జనార్ధన్ ఇటీవలే తన ఉద్యోగం కోల్పోయినట్టుగా సమాచారం.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు)
ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. ‘జనార్థనన్, మినిజ చాలా మంచివారు. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదు. జనార్ధనన్ తన ఉద్యోగం కోల్పోయాడు. కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడు. ఈ ఘటనపై అతని సహోద్యోగులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు. ఇలా జరిగి ఉండాల్సి కాదు’ అని పేర్కొన్నారు. కాగా, జననార్ధనన్‌కు-మినిజ దంపతకుల ఒక కుమారుడు ఉన్నాడు. అతడు అబుదాబిలోనే చదువుకున్నప్పటకీ.. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు.(అన్‌లాక్ 3.0 : సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి?)
Comments
Please login to add a commentAdd a comment