mysterious circumstances
-
ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పదం మరణం కలకలం రేపింది. షాద్ నగర్‌కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అరవింద్ సముద్రంలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇంటినుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం అతని మృతదేహం సముద్రంలో కనిపించింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును కూడా గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేకోణంలో ఆరాతీస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.కాగా ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డాడు అరవింద్ 18నెలల క్రితం వివాహం చేసుకున్న అరవింద్ భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్‌నగర్‌కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూయడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన లారీ ప్రమాదంలో బీజేపీ నాయకుడు, అరవింద్ తండ్రి ఆరటి కృష్ణ యాదవ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివసిస్తున్నారు. భర్త మరణం తరువాత ఒక్కగానొక్కకొడుకును పెంచి పెద్ద చేసింది. పెళ్లి చేసి అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఇపుడు అరవింద్ కూడా దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
అబుదాబిలో భారత దంపతుల అనుమానాస్పద మృతి
దుబాయ్ : అబుదాబిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫ్లాట్‌లో భారత్‌కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మేరకు ఖలీజ్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. మృతులను కేరళ కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్ధనన్ పట్టీరీ(57), మినిజ(52) దంపతులుగా గుర్తించారు. అయితే వారి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. వీరు 18 ఏళ్ల నుంచి అబుదాబిలో నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. జనార్ధనన్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, మినిజా చార్టర్ అకౌంటెంట్‌గా ఉన్నారు. అయితే జనార్ధన్ ఇటీవలే తన ఉద్యోగం కోల్పోయినట్టుగా సమాచారం.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. ‘జనార్థనన్, మినిజ చాలా మంచివారు. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదు. జనార్ధనన్ తన ఉద్యోగం కోల్పోయాడు. కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడు. ఈ ఘటనపై అతని సహోద్యోగులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు. ఇలా జరిగి ఉండాల్సి కాదు’ అని పేర్కొన్నారు. కాగా, జననార్ధనన్కు-మినిజ దంపతకుల ఒక కుమారుడు ఉన్నాడు. అతడు అబుదాబిలోనే చదువుకున్నప్పటకీ.. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు.(అన్‌లాక్ 3.0 : సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి?) -
మంత్రి మెడపై మరో కత్తి, వీడని మరణ మిస్టరీ
చెన్నై: ఐటీ దాడులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ మెడపై ఆయన స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణియన్ (52) మరణ మిస్టరీ మరో కత్తిలా వేలాడుతోంది. మరణానికి ముందు సుబ్రమణియన్‌కు ఒకే నంబర్ నుంచి 20 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. నామక్కల్ ఉపాధ్యాయ కాలనీకి చెందిన సుబ్రమణియన్ మంత్రి విజయభాస్కర్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుడు. ఈ స్నేహంతో మంత్రి ద్వారా అనేక ప్రభుత్వ భవన నిర్మాణాల కాంట్రాక్టులు పొంది కోట్లు గడించాడు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ తరఫున ధన ప్రవాహానికి నేతృత్వం వహించిన మంత్రి విజయభాస్కర్ సహా 35 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. అదే సమయంలో సుబ్రమణియన్ ఇంటిపై కూడా దాడులు చేసి రెండుసార్లు కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. నగదు బట్వాడాలో మంత్రి వెనుక సుబ్రమణియన్ ప్రముఖ పాత్ర పోషించినట్లు అనుమానించిన ఐటీ అధికారులు నిజాలు రాబట్టేందుకు గట్టిగా విచారించారు. ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. తెల్లారితే చెన్నైలోని ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉండగా ముందురోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినా అనేక అనుమానాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడుల అనంతరం కొన్ని రోజులుగా సుబ్రమణియన్ తన సెల్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి గడుపుతున్నారు. అయితే చివరిగా ఆయనకు కొందరు వీఐïపీల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. సుబ్రమణియన్ మరణానికి ముందు గుర్తుతెలియని వ్యక్తి ఒకే నంబరు నుంచి 20 సార్లు ఫోన్ చేసి అతనికి మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా అంతుచిక్కలేదు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు వీఐపీల జాబితాను సిద్ధం చేశారు. అలాగే తోటలో కూర్చుని తన స్వహస్తాలో పేజీల ఉత్తరం రాశాడని తోటలోని కూలీలు పోలీసులకు తెలపగా, ఆ ఉత్తరం కనిపించడం లేదు. సుబ్రమణియన్ స్వాధీనంలో మంత్రికి సంబంధించినవిగా చెప్పబడుతున్న కొన్ని డాక్యుమెంట్లు మాయమయ్యాయి. ఐటీ అధికారుల ముందు సుబ్రమణియన్ వాంగ్మూలం మంత్రి విజయభాస్కర్‌ను ఇరుకున పడేస్తుందనే కారణంతో ఎవరైనా హత్యచేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఏఎస్పీ శశికుమార్ మృతిపై అనుమానాలు!
విశాఖ: పాడేరు ఏఎస్పీ శశికుమార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శశికుమార్‌కు తీసిన ఎక్స్‌రేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆయన పుర్రెకు మూడు భాగాలుగా పగుళ్లు ఏర్పడగా... గొంతులో బంతిలాంటి వస్తువు ఉన్నట్లు గుర్తించారు. మాట రాకుండా ఎవరైనా గొంతులో ఏదైనా వస్తువును కుక్కారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు పాడేరు చేరుకున్న సీఐడీ టీమ్ విచారణ ప్రారంభించింది. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. కాగా ఏఎస్పీ శశికుమార్ గురువారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏఎస్పీ చాంబర్లోకి మీడియాను అనుమతించలేదు. క్లూస్ టీం వివరాలు సేకరించే వరకు లోపలికి వెళ్లరాదని కట్టడి చేశారు. మరోవైపు పాడేరు పోలీసులు ఈ సంఘటనపై నోరు మెదపడం లేదు. -
యువకుడి అనుమానాస్పద మృతి
పులివెందుల: వైఎస్సార్ జిలాల పులివెందుల మండల కేంద్రంలో యువకుడి అనుమానాస్పద మృతి సంచలనంరేపింది. పట్టణానికి చెందిన సందీప్ రెడ్డి(28).. స్థానిక శ్రీనివాసా హాల్ పక్కన అనుమానాస్పద స్థితిలో శవంగా కనిపించాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అమెరికాలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి
అమెరికాలో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి మహిళ ఒకరు అనుమానాస్పద స్థితిలో ఓ కారులో మరణించి కనిపించారు. ఆమె ఇద్దరు బిడ్డల తల్లి. అమెరికాలోని పెన్సల్వేనియా రాష్ట్రంలో ఉండేవారు. నాదియా మాలిక్ (22) ప్రీ మెడికల్ విద్యార్థిని. ఫిలడెల్ఫియాలో అత్యంత రద్దీగా ఉండే ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కారులో ప్రయాణికుల సీట్లో మరణించి కనిపించారు. మాలిక్ స్నేహితుడు భూపీందర్ సింగ్‌ను పోలీసులు గతంలో పెరోల్ ఉల్లంఘన కేసులో అరెస్టు చేశారు. అతడిని ఓహియో నుంచి ఫిలడెల్ఫియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అతడికి గతంలో నేరచరిత్ర ఉండటంతో అతడిని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. వీరిద్దరి మధ్య సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. ఆ కారు ఆ ప్రాంతంలో 12 రోజులుగా పడి ఉన్నా.. నాదియా మాలిక్ మృతదేహాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేదు. చివరకు కారును అక్రమంగా పార్కింగ్ చేసినందుకు పోలీసులు తనిఖీ చేయగా విషయం తెలిసింది. మంచు దట్టంగా అలముకోవడంతో దాన్ని తొలగించే యంత్రాలకు అడ్డుగా ఉందని కారును వేరే ప్రదేశానికి తరలించారు కూడా. అప్పుడూ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు. ఆమె శవం ఓ బ్యాగ్, దుస్తుల కింద దాచిపెట్టి ఉండటంతో ఎవరికీ తెలియలేదు. ఈనెల పదోతేదీ నుంచి ఆమె అదృశ్యమైనట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాదియా పిల్లలిద్దరికీ తండ్రి అయిన భూపీందర్ సింగ్‌తో చివరిసారిగా ఆమె కనిపించినట్లు తెలిసింది. తాను భూపీందర్తో ఉన్నానని, అతడు తనను బయటకు వెళ్లనివ్వట్లేదని తనకు చెప్పినట్లు నాదియా స్నేహితుడు థామస్ సింగ్ పోలీసులకు తెలిపాడు.