ఏఎస్పీ శశికుమార్ మృతిపై అనుమానాలు! | Visakha district paderu asp Sasi Kumar dies under mysterious circumstances | Sakshi

ఏఎస్పీ శశికుమార్ మృతిపై అనుమానాలు!

Published Fri, Jun 17 2016 1:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

ఏఎస్పీ శశికుమార్ మృతిపై అనుమానాలు!

ఏఎస్పీ శశికుమార్ మృతిపై అనుమానాలు!

పాడేరు ఏఎస్పీ శశికుమార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శశికుమార్‌కు తీసిన ఎక్స్‌రేలో కీలక విషయాలు బయటపడ్డాయి.

విశాఖ: పాడేరు ఏఎస్పీ శశికుమార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శశికుమార్‌కు తీసిన ఎక్స్‌రేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆయన పుర్రెకు మూడు భాగాలుగా పగుళ్లు ఏర్పడగా... గొంతులో బంతిలాంటి వస్తువు ఉన్నట్లు గుర్తించారు. మాట రాకుండా ఎవరైనా గొంతులో ఏదైనా వస్తువును కుక్కారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు పాడేరు చేరుకున్న సీఐడీ టీమ్‌ విచారణ ప్రారంభించింది.

ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. కాగా ఏఎస్పీ శశికుమార్ గురువారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు  ఈ సంఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏఎస్పీ చాంబర్‌లోకి మీడియాను అనుమతించలేదు. క్లూస్ టీం వివరాలు సేకరించే వరకు లోపలికి వెళ్లరాదని కట్టడి చేశారు. మరోవైపు పాడేరు పోలీసులు ఈ సంఘటనపై నోరు మెదపడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement