Sara Ali Khan Refuses To Spend Rs 400 For Roaming While In Abu Dhabi - Sakshi
Sakshi News home page

Sara Ali Khan: రూ.400 కోసం పక్కవారిని సాయం కోరిన సారా అలీ ఖాన్

Published Sun, Jun 4 2023 1:03 PM | Last Updated on Sun, Jun 4 2023 3:02 PM

Sara Ali Khan refused to spend Rs 400 for roaming in Abu Dhabi - Sakshi

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'జరా హట్‌కే జరా బచ్‌కే'. ఈనెల 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో రూ.12.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు.

(ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్‌ కమెడియన్‌ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!)

అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్‌ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్‌నెట్‌ కోసం పక్కవారిని హాట్‌స్పాట్‌ ఆన్‌ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది. 

సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి  అడిగా.  రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్‌ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్‌స్పాట్‌ అడిగాను.' అంటూ  చెప్పుకొచ్చింది. 

(ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement