Roaming charges
-
ఒక్కరోజుకు నాలుగు వందలా?.. తనకు అవసరం లేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'జరా హట్కే జరా బచ్కే'. ఈనెల 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో రూ.12.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్నెట్ కోసం పక్కవారిని హాట్‌స్పాట్ ఆన్ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది. సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి అడిగా. రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్‌ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్‌స్పాట్ అడిగాను.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) -
రోమింగ్ చార్జీలు తగ్గాయ్..
కాల్ చార్జీలు 40 శాతం వరకూ - ఎస్ఎంఎస్ చార్జీలు 75% వరకూ - నేటి నుంచి వర్తింపు న్యూఢిల్లీ: రోమింగ్ చార్జీలు దిగివస్తున్నాయి. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు రోమింగ్ చార్జీలను 75 శాతం వరకూ తగ్గించాయి. ఈ తగ్గింపు నేటి (మే1-శుక్రవారం) నుంచి అమలవుతుంది. రోమింగ్‌లో ఉన్నప్పుడు కాల్స్ చార్జీలు 40 శాతం వరకూ, ఎస్ఎంఎస్ చార్జీలు 75 శాతం వరకూ తగ్గాయి. గత నెల 9న టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నేషనల్ రోమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ టారిఫ్‌ల పరిమితులను తగ్గించింది. దీంతో టెలికం కంపెనీలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. ఎయిర్టెల్: ఇన్కమింగ్ కాల్ రేట్లు 40 శాతం వరకూ, అవుట్ గోయింగ్ (ఎస్టీడీ) కాల్ రేట్లు 23 శాతం వరకూ. అవుట్ గోయింట్ లోకల్ కాల్ రేట్లు 20 శాతం వరకూ, లోకల్ ఎస్ఎంఎస్ రేట్లు 75 శాతం వరకూ, ఎస్టీడీ ఎస్ఎంఎస్ రేట్లు 74 శాతం వరకూ తగ్గించింది. ఐడియా సెల్యులర్: ఇన్కమింగ్ కాల్స్‌ను 40 శాతం తగ్గించింది. అవుట్ గోయింగ్ లోకల్ కాల్ రేట్లను 20 శాతానికి, అవుట్ గోయింగ్ ఎస్టీడీ కాల్ రేట్లను 23 శాతం చొప్పున తగ్గించింది. ఆర్‌కామ్: ఇన్కమింగ్ కాల్స్ చార్జీలను 40 శాతం తగ్గించామని వివరించింది. అవుట్ గోయింగ్ కాల్స్ (లోకల్, ఎస్టీడీల) చార్జీలను 23 శాతం వరకూ తగ్గించామని పేర్కొంది.