శ్రీలంక ఓపెన‌ర్ విధ్వంసక‌ర సెంచ‌రీ.. అయినా పాపం! | Kusal Perera is the first player to score a century in the LPL 2024 | Sakshi
Sakshi News home page

LPL 2024: శ్రీలంక ఓపెన‌ర్ విధ్వంసక‌ర సెంచ‌రీ.. అయినా పాపం!

Published Wed, Jul 3 2024 7:13 PM | Last Updated on Wed, Jul 3 2024 7:29 PM

Kusal Perera is the first player to score a century in the LPL 2024

లంక ప్రీమియ‌ర్‌-2024లో జ‌ఫ్నా కింగ్స్ బోణీ కొట్టింది.  బుధ‌వారం పల్లెకెలె వేదిక‌గా దంబుల్లా సిక్స‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జ‌ఫ్నా కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని జఫ్నా 6 వికెట్లు కోల్పోయి చేధించింది.

జఫ్నా బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(80) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ అసలంక(50) అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. దంబుల్లా బౌలర్లలో తుషారా, రెహ్మాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

కుశాల్‌ సెంచరీ వృథా..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దంబుల్లా సిక్స‌ర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దంబుల్లా బ్యాటర్లలో ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 

52 బంతులు ఎదుర్కొన్న పెరీరా.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు నువనీడు ఫెర్నాండో(40) పరుగులతో రాణించాడు. ఏదేమైనప్పటికి దంబుల్లా ఓటమి పాలవ్వడంతో కుశాల్‌ సెంచరీ వృథా అయిపోయింది. కాగా ఎల్‌పీఎల్‌-2024లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా కుశాల్‌ పెరీరా నిలిచాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement