Jaffna
-
శ్రీలంక ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. అయినా పాపం!
లంక ప్రీమియర్-2024లో జఫ్నా కింగ్స్ బోణీ కొట్టింది. బుధవారం పల్లెకెలె వేదికగా దంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జఫ్నా కింగ్స్ ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని జఫ్నా 6 వికెట్లు కోల్పోయి చేధించింది.జఫ్నా బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(80) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ అసలంక(50) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. దంబుల్లా బౌలర్లలో తుషారా, రెహ్మాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కుశాల్ సెంచరీ వృథా..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. దంబుల్లా బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ పెరీరా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 52 బంతులు ఎదుర్కొన్న పెరీరా.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు నువనీడు ఫెర్నాండో(40) పరుగులతో రాణించాడు. ఏదేమైనప్పటికి దంబుల్లా ఓటమి పాలవ్వడంతో కుశాల్ సెంచరీ వృథా అయిపోయింది. కాగా ఎల్పీఎల్-2024లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా కుశాల్ పెరీరా నిలిచాడు. -
తుస్సుమన్న బాబర్ ఆజమ్.. తిప్పేసిన అనామక బౌలర్
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ నిన్న (జులై 30) ప్రారంభమైంది. కొలొంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, కొలొంబో స్ట్రయికర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. తౌహిద్ హ్రిదోయ్ (39 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. A few moments from the opening ceremony earlier this evening.#LPL2023 #LiveTheAction pic.twitter.com/QlczC1FX4Y — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 నిషాన్ మధుష్క (12), గుర్భాజ్ (21), అసలంక (12), ప్రియమల్ పెరీర (22) రెండంకెల స్కోర్లు చేసినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆఖర్లో దునిత్ వెల్లలగే (25 నాటౌట్), కెప్టెన్ తిసార పెరీరా (14 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో జాఫ్నా కింగ్స్ ఓ మోస్తరు స్కోర్‌ను ప్రత్యర్ధి ముందు ఉంచగలిగింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, మతీష పతిరణ, చమిక కరుణరత్నే, సందకన్ తలో వికెట్ పడగొట్టారు. As promised, a spectacular opening ceremony and one to remember for a long time! Here are a few clicks. #LPL2023 #LiveTheAction pic.twitter.com/sY3FsYdQ6k — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 The young star from Bangladesh took on a powerful bowling attack like a boss, and constructed a spirited half century! #LPL2023 #LiveTheAction pic.twitter.com/kHiAwvwTWF — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తిప్పేసిన అనామక బౌలర్.. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొలొంబో.. జాఫ్నా బౌలర్, అనామక కుర్రాడు విజయకాంత్ వియాస్కాంత్ (4-0-17-2) మాయాజాలం ధాటికి 19.4 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. విజయకాంత్‌తో పాటు హర్దుస్ విల్జోయెన్ (3/31), దిల్షన్ మధుషంక (2/18), తిసార పెరీరా (1/29) రాణించడంతో కొలొంబో టీమ్ ఓ మోస్తరు స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది. Jaffna Kings stars shine bright with the ball! #LPL2023 #LiveTheAction pic.twitter.com/mxfUmeGa0T — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తుస్సుమన్న బాబర్ ఆజమ్.. జాఫ్నాతో పోలిస్తే చాలా రెట్టు పటిష్టమైన కొలొంబో స్ట్రయికర్స్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. కెప్టెన్ నిరోషన్ డిక్వెల్లా (34 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) ఒక్కడు అర్ధసెంచరీతో రాణించాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి తుస్సుమన్నాడు. తిసార పెరీరా బౌలింగ్‌లో బౌండరీ బాదిన అనంతరం బాబర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన నిస్సంక (1), ఫెర్నాండో (17), మహ్మద్ నవాజ్ (3), యశోధ లంక (11), నసీం షా (0), పతిరణ (8) నిరాశపరచగా.. తమిక కరుణరత్నే (23) పర్వాలేదనిపించాడు. Dickwella came back with a bang this season and showcased his batting prowess! He was a one-man army!#LPL2023 #LiveTheAction pic.twitter.com/rcfL5IeJir — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 -
బాలికపై అత్యాచారం.. ఏడుగురికి ఉరి
కొలంబో(శ్రీలంక): నేటి సమాజంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటనలో ఏడుగురికి శ్రీలంక హైకోర్టు మరణ శిక్ష విధించింది. 2015లో తమిళులు అధికంగా ఉండే జాఫ్నా ప్రావిన్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పున్కుడివితు ప్రాంతానికి చెందిన శివలోగనాథన్(18) అనే యువతి 2015 మే 13వ తేదీన స్కూల్‌కు వెళ్లి కనిపించకుండా పోయింది. మరుసటి రోజు కాళ్లు, చేతులు, కట్టేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులు చూసి దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జాఫ్నా హైకోర్టు ఏడుగురిని దోషులుగా తేల్చి వారికి మరణశిక్ష విధించింది. ఇందులో ప్రధాన నిందితుడు స్విస్ కుమార్ బాలికపై గ్యాంగ్‌రేప్‌తో పాటు హత్యను వీడియో తీశారు. ఈ హత్యాచారానికి సంబంధించి నిందితులపై పోలీసులు 41 అభియోగాలు మోపారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నిందితులు ఏడుగురికి 30 ఏళ్ల కఠిన కారాగారంతోపాటు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాక పది లక్షల డాలర్ల జరిమానా విధించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, నిందితుల్లో ఒకరు జైలు నుంచి తప్పించుకోవటానికి కారకుడయ్యారని సీనియర్ పోలీస్ అధికారి లలిత్ జయసింగేను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సర్వీసులో ఉండగా అరెస్టైన ఉన్నత స్థాయి పోలీసు అధికారి ఈయనే కావటం గమన్హారం. -
నోరు జారిన మేయర్
► రసాభాసగా నగరపాలక మండలి సమావేశం ► ప్రజా సమస్యలపై గళమెత్తిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ► వ్యక్తిగత ఆరోపణలకు దిగిన టీడీపీ సభ్యులు ► ఏకగ్రీవంగా కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నెల్లూరు (పొగతోట) : నెల్లూరు నగర ప్రథమ పౌరుడు దూషణలకు దిగారు. ‘యే.. చ్చా పో.. చీ.. పో.. చ్చా కూర్చో.. యే బయటకు పో’ అంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లపై విరుచుకుపడ్డారు. నగరపాలక మండలి అత్యవసర సమావేశం మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యతన నగరపాలక మందిరంలో గురువారం జరిగింది. 11 నెలల అనంతరం నగరపాలక కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం సమావేశం నిర్వహించగా.. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమావేశానికి హాజరయ్యారు. కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసినట్టు మేయర్ అజీజ్ ప్రకటించగా.. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్ యాదవ్ కలగజేసుకుని.. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి 11 నెలలు దాటుతోందని, ప్రజా సమస్యలపై చర్చిందుకు సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుపట్టారు. ఈ దశలో మేయర్ పైవిధంగా దూషణకు దిగారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ కమిషనర్ ఢిల్లీరావుకు నోటీసు ఇచ్చినా ఫలితం లేకపోయిందని రూప్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేయగా.. మేయర్ నోరు జారారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. వైఎస్సార్ సీపీ సభ్యులంతా ఏకమై ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుపట్టారు. సమాధానం చెప్పలేక మేయర్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ దశలో టీడీపీ సభ్యులు రూప్‌కుమార్‌ను చుట్టుముట్టడంతో యుద్ధవాతావరణం నెలకొంది. వైఎ స్సార్ సీపీ కార్పొరేటర్లు దామవరపు రాజశేఖర్, దేవరకొండ ఆశోక్ తదితరులు టీడీపీ సభ్యులను అడ్డుకునే యత్నం చేయగా.. మేయర్ పోలీసులను పిలిచి ప్రతిపక్ష సభ్యులు బయటకు పంపిం చాలని ఆదేశించారు. ఈ దశలో రూప్‌కుమార్ యాదవ్ సభ్యులకు నచ్చచెప్పి అందరినీ శాంతింప చేశారు. ఆయన మాట్లాడుతూ నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి ప్రజ లు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతున్నారని వివరించారు. నిబంధనల ప్రకారం మూ డు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాల్సి ఉండగా పట్టించుకోవడం లేద ని వాపోయారు. డిప్యూటి మేయర్ ము క్కాల ద్వారకానా«థ్ మాట్లాడుతు సమస్యలపై చర్చిందుకు తప్పకుండా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేటర్ బి.పద్మజ మాట్లాడుతూ సమస్యల్ని విస్మరించి కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం సమావేశం ఏర్పాటు చేయడం మంచిపద్ధతి కాదన్నారు. సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ డీల్లీరావు హామీ ఇవ్వడంతో పరిస్థితి చక్కబడింది. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక సమావేశంలో ఐదుగుర్ని కో–ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. స్వర్ణ వెంకయ్య, ఓం ప్రకాష్‌యాదవ్, మండ్ల కామక్షి, మైనార్టీ నాయకుడు మహమ్మద్ జరీనా సుల్తానా, బిర్మాల్ జైన్ ఎన్నిక కాగా.. వారిని మేయర్, అన్ని పార్టీల కార్పొరేటర్లు అభినందించారు. -
మీ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చా!
జాఫ్నాలో తమిళులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్య పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని స్పష్టీకరణ తమిళ నిరాశ్రయులకు 27 వేల కొత్త ఇళ్ల అందజేత జాఫ్నా/కొలంబో: దశాబ్దాల అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడి, తమిళుల హక్కుల కోసం నినదించిన జాఫ్నా గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. శ్రీలంకలో చివరిరోజు పర్యటనలో భాగంగా శనివారం ఆయన తమిళుల ప్రాబల్య ప్రాంతమైన జాఫ్నాను సందర్శించారు. పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని, అందరూ ఆత్మగౌరవంతో జీవించాలంటూ పరోక్షంగా తమిళుల ఆకాంక్షను చాటారు. సంక్షుభిత ప్రాంతంలో ఇన్నేళ్లూ కష్టనష్టాల పాలైన వారి కన్నీళ్లు తుడిచేందుకు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే. 2013లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ జాఫ్నాలో పర్యటించారు. ఆ తర్వాత ఓ అంతర్జాతీయ నేత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఇలావలైలో తమిళులకు 27 వేల కొత్త ఇళ్లను అందజేశారు. మంగళ హారతులు, మేళతాళాల మధ్య సంప్రదాయ రీతిలో మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. గృహ ప్రవేశంలో భాగంగా పాలు పొంగించే కార్యక్రమంలో మోదీ స్వయంగా పాల్గొన్నారు. రెండో దశలో మరో 47 వేల గృహాలు నిర్మిస్తామన్నారు. జాఫ్నాలో రూ.60 కోట్లతో భారత్ నిర్మిస్తున్న సాంస్కృతిక కేంద్రానికీ మోదీ శంకుస్థాపన చేశారు. ‘పర్యటన షెడ్యూల్లో లేకపోయినా ఈ నేలకు వందనం చేసేందుకే ఇక్కడకు వచ్చాను. ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. ప్రజలందరూ సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవంతో జీవించాలి. అందుకు దోహదపడేలా శ్రీలంక రాజ్యాంగానికి 13వ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. నేను సహకార సమాఖ్య వ్యవస్థను నమ్ముతాను’ అని అన్నారు. మోదీ వెంట జాఫ్నా సీఎం, తమిళ నేత సీవీ విఘ్నేశ్వరన్ ఉన్నారు. భారత్‌కు సమీప ప్రాంతమైన జాఫ్నాలోని తలైమన్నార్‌లో రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు. మహాబోధి వృక్షానికి పూజలు.. జాఫ్నాకు బయల్దేరే ముందు మోదీ.. ప్రాచీనకాలంలో లంక రాజధాని అయిన అనురాధాపుర పట్టణానికి వెళ్లి మహాబోధి వృక్షం వద్ద పూజలు చేశారు. లంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన కలిసి ఈ మహాబోధి వృక్షాన్ని సందర్శించిన మోదీ.. అక్కడ అరంగటపాటు గడిపారు. అనంతరం నాగులేశ్వరం ఆలయాన్ని కూడా మోదీ సందర్శించారు. రాజపక్సతో భేటీ.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సతో.. మోదీ కొలంబోలోని భారత హైకమిషన్ ఆఫీసులో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమి వెనుక భారత్, అమెరికా, యూరప్ దేశాల హస్తం ఉందని ఇటీవల రాజపక్స ఆరోపించడం తెలిసిందే. ప్రధాని గౌరవార్థం భారత హైకమిషన్ ఇచ్చిన విందులోనూ మోదీ పాల్గొని అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. రెండ్రోజుల లంక పర్యటన ముగించుకొన్న మోదీ శనివారం రాత్రి భారత్ బయల్దేరారు. లంక ప్రధాని విక్రమసింఘే కొలంబో విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. 5 రోజుల పర్యటనలో ప్రధాని సీషెల్స్, మారిషస్, లంకలో పర్యటించారు.