
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సోమవారం ఆటలో భాగంగా బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో కుశాల్ పెరీరా నియంత్రణ కోల్పోయి వెళ్లి ప్రకటనల బోర్డుని ఢీకొన్నాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కనీసం నడవలేకపోవడంతో స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకెళ్లారు.
అనంతరం అక్కడ వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగుపడిందని.. ఒకవేళ జట్టుకి అవసరమైతే మంగళవారం బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment