BAN Vs SL: ఎట్టకేలకు శ్రీలంక గెలిచింది! | BAN Vs SL: Sri Lanka Won In 3rd ODI 2021 By 97 Runs | Sakshi
Sakshi News home page

BAN Vs SL: శ్రీలంకకు ఊరట విజయం

Published Sat, May 29 2021 8:39 AM | Last Updated on Sat, May 29 2021 1:56 PM

BAN Vs SL: Sri Lanka Won In 3rd ODI 2021 By 97 Runs - Sakshi

ఢాకా: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి బంగ్లాదేశ్‌ జట్టుకు సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక చివరిదైన మూడో వన్డేలో 97 పరుగుల తేడాతో నెగ్గి ఊరట చెందింది. కెప్టెన్‌ కుశాల్‌ పెరీరా (122 బంతుల్లో 120; 11 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ సాధించడంతో... తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిరీ్ణత 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. గుణతిలక (33 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్‌), ధనంజయ డిసిల్వా (55 నాటౌట్‌; 4 ఫోర్లు) రాణించారు.

అనంతరం బంగ్లాదేశ్‌ 42.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. మొసద్దీక్‌ హుస్సేన్‌ (51; 3 ఫోర్లు, సిక్స్‌), మహ్ముదుల్లా (53; 2 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. శ్రీలంక బౌలర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దుష్మంత చమీరా 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. హసరంగ, రమేశ్‌ మెండిస్‌ రెండేసి వికెట్లు తీశారు.

చదవండి: BAN Vs SL: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్‌; అలా అయితే ఇంకా సంతోషించేవాడిని!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement