
ఇండోర్ : కొండంత లక్ష్యానికి అదరక.. బెదరక.. వరుస సిక్సర్లతో భారత బౌలర్లను ఓ ఆటాడుకున్న శ్రీలంక బ్యాట్స్‌మన్ కుషాల్ పెరీరా తమ ఓటమికి మణికట్టు బౌలర్లు కుల్దీప్, చహల్లే కారణమని అభిప్రాయపడ్డాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘మణికట్టు స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి బౌలింగ్ ఎదుర్కోవడానికి మా బ్యాట్స్‌మన్ తెగ ఇబ్బంది పడుతున్నారు. బ్యాటింగ్ అనుకూలించే మైదానంలో మేమింకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సింది. మా బలాన్ని దృష్టిలో ఉంచుకునే తొలుత ఫీల్డింగ్ తీసుకున్నాం. కానీ రోహిత్, రాహుల్‌ల విరోచిత భాగస్వామ్యానికి అడ్డుకట్ట వేయలేకపోయాం. ఆటలో గెలుపు, ఓటములు సహజమే. మా తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకున్నాం. ఓ జట్టుగా మంచి ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ ఓటమి నుంచి కోలుకొని చివరి మ్యాచ్‌పై దృష్టి పెడ్తామని’ కుశాల్ వ్యాఖ్యానించాడు.
కుల్దీప్, చహల్‌ల బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డ కుషాల్ పెరీరా 77 (37 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) పరుగులతో గెలిపించేంత పనిచేశాడు. చివరికి కుల్దీప్ బౌలింగ్‌లో పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 88 పరుగులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment