ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్ధీప్ యాదవ్ అదరగొడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చహల్ 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న కుల్ధీప్ యాదవ్ 18 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సూచించాడు. కొన్నాళ్ల పాటు భారత తరుపున చాహల్, అత్యత్తుమంగా రాణించారు.
కాగా 2019 ప్రపంచ కప్ తర్వాత వీరిద్దరూ ఫామ్‌ను కోల్పోయారు. తరువాత కొన్ని మ్యాచ్‌లకు జట్టుకు దూరమయ్యారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021 కు కూడా వీరిద్దకి చోటు దక్కలేదు. అయితే 'కుల్-చా' ద్వయం మళ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. "టీమిండియా తరపున అద్భతంగా రాణించిన కుల్ధీప్,చహల్ భాగస్వామ్యాన్ని సెలక్టర్లు ఎందుకు విడగొట్టారో నాకు తెలియదు. అయితే ప్రస్తుతం 'కుల్-చా' ద్వయాన్ని ఖచ్చితంగా మళ్లీ జట్టులోకి తీసుకురావాలి.
వారిద్దరూ కలిసి భారత్ తరపున ఆడినప్పుడు.. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టేవారు. టీ20, వన్డేల్లో భారత జట్టుకు చాలా విజయాలు అందించారు. కాబట్టి వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగం కావాలి" అని "డ్రీమ్ సెట్ గో" ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్భజన్ పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ జరగనున్న ఆస్ట్రేలియాలో పిచ్‌లు పెద్దగా స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించవు. అంతేకాకుండా రవీంద్ర జడేజా వంటి స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో వీరిద్దరికి భారత జట్టులో మరి చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి.
చదవండి: IPL 2022: 'కోల్‌కతా మ్యాచ్‌లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్'
Comments
Please login to add a commentAdd a comment