శ్రీలంకదే వన్డే సిరీస్ | Kusal, Thirimanne lead Sri Lanka to series win | Sakshi
Sakshi News home page

శ్రీలంకదే వన్డే సిరీస్

Published Thu, Nov 5 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

Kusal, Thirimanne lead Sri Lanka to series win

కొలంబో: కుషాల్ పెరీరా (92 బంతుల్లో 99; 6 ఫో ర్లు, 4 సిక్సర్లు), తిరిమన్నె (95 బంతుల్లో 81 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్ ) చెలరేగడంతో బుధవారం  జరిగిన  రెండో వన్డేలో లంక 8 వికెట్ల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. వర్షం కారణంగా 38 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో  వెస్టిండీస్ 37.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. చార్లెస్ (70 బంతుల్లో 83; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), శామ్యూల్స్ (61 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. లంక 36.3 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసి (డక్‌వర్త్ లూయీస్ ప్రకారం) నెగ్గింది.  మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement