సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ జరుగుతుండగా సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్జే టీ20 సిరీస్‌తో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు కూడా నోర్జే దూరంగా ఉన్నాడు. నోర్జే ఎడమకాలి బొటనవేలు ప్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలింది. పాక్‌తో టీ20 సిరీస్‌కు నోర్జే ప్రత్యామ్నాయంగా అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ డయ్యాన్ గేలిమ్ ఎంపికయ్యాడు. గేలిమ్ తన 60 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో 46 వికెట్లు పడగొట్టాడు.
కాగా, నోర్జే ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో చివరిసారి సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో నోర్జే సౌతాఫ్రికా తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా (15 వికెట్లు) ఉన్నాడు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా నోర్జే జాతీయ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పుకున్నాడు.
సౌతాఫ్రికాను పట్టి పీడిస్తున్న గాయాలు
ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టును గాయాల సమస్య వేధిస్తుంది. నోర్జే గాయపడిన అనంతరం సౌతాఫ్రికా క్యాజ్యువల్స్ (బౌలర్లు) సంఖ్య ఐదుకు చేరింది. నోర్జేకు ముందు గెరాల్డ్ కొయెట్జీ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి, వియాన్ ముల్దర్ గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరంతా జట్టుకు దూరంగా ఉంటున్నారు.
ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ మొదలైంది. డిసెంబర్ 10న జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్‌పై సౌతాఫ్రికా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. కిల్లర్ మిల్లర్ ఊచకోత (82), జార్జ్ లిండే ఆల్‌రౌండ్ షో (48, 4/21) కారణంగా ఈ మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment