టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-డిలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జూన్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు రెచ్చిపోయారు. ప్రొటీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని తప్పులో కాలేసింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే అంచనాతో లంక కెప్టెన్ హసరంగ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ విషయంలో అతని అంచనాలు తారుమారయ్యాయి.
సౌతాఫ్రికా బౌలర్లు, ముఖ్యంగా పేసర్ల ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అన్రిచ్ నోర్జే (4-0-7-4), ఓట్నీల్ బార్ట్‌మన్ (4-1-9-1),కగిసో రబాడ (4-1-21-2) కేశవ్ మహారాజ్ (4-0-22-2) లంకేయులకు దారుణంగా దెబ్బ తీశారు. లంక ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు.
నిస్సంక (3), కుశాల్ మెండిస్ (19), కమిందు మెండిస్ (11), హసరంగ (0), సమరవిక్రమ (0), అసలంక (6), ఏంజెలో మాథ్యూస్ (16), దసున్ షనక (9), పతిరణ (0), తుషార (0) దారుణంగా విఫలమయ్యారు.
లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో శ్రీలంక తమ అత్యల్ప పవర్ ప్లే స్కోర్‌ను (24) ఈ మ్యాచ్‌లో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది.
టీ20ల్లో తొలి 10 ఓవర్లలో అత్యల్ప స్కోర్‌ను శ్రీలంక ఇదే మ్యాచ్‌లో నమోదు చేసింది. తొలి 10 ఓవర్లలో శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నోర్జే (4/7) నమోదు చేసిన గణాంకాలు టీ20 వరల్డ్‌కప్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యుత్తమ గణాంకాలుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment