Courtesy: Delhi Capitals Twitter
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ అన్‌రిచ్ నోర్ట్జే ఐపీఎల్ 15వ సీజన్‌లో ఏప్రిల్ 7 నుంచి అందుబాటులోకి రానున్నాడు. మొదట గాయం కారణంగా నోర్ట్జే సీజన్‌కు అందుబాటులో ఉండడని రూమర్స్ వచ్చినప్పటికి అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. నోర్ట్జే ఇప్పటికే లీగ్ ఆడేందుకు ముంబైలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం లీగ్ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నాడు.
తాజాగా నోర్ట్జే ఏప్రిల్ 7 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు అందుబాటులోకి రానున్నాడు. దీంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్న నోర్ట్జే.. ఏప్రిల్ 7న లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. ఒక రకంగా ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి బూస్టప్ అని చెప్పొచ్చు. గత సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన నోర్ట్జే 12 వికెట్లు తీశాడు. కాగా మెగావేలానికి ముందే నోర్ట్జేను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 24 మ్యాచ్‌లాడిన నోర్ట్జే 34 వికెట్లు తీశాడు. కాగా నవంబర్ 2021 నుంచి వెన్నునొప్పి కారణంగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఇక మార్చి 26న ఆరంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో(మార్చి 27న) ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment