IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త | IPL 2024: Proteas Pacer Anrich Nortje Join Delhi Capitals Squad | Sakshi
Sakshi News home page

IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త

Published Mon, Mar 25 2024 6:49 PM | Last Updated on Mon, Mar 25 2024 7:01 PM

IPL 2024: Proteas Pacer Anrich Nortje Join Delhi Capitals Squad - Sakshi

జైపూర్‌ వేదికగా ఈనెల 28న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. గాయం కారణంగా సీజన్‌ తొలి మ్యాచ్‌కు (పంజాబ్‌) దూరమైన ఆ జట్టు స్టార్‌ పేసర్‌ ఎన్రిచ్‌ నోర్జే జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. నోర్జేకు స్వాగతం ఓ వీడియోను కూడా షేర్‌ చేసింది. ​ 

ఇదిలా ఉంటే, ఈ నెల 23న పంజాబ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులు చేసి దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అభిషేక్‌ పోరెల్‌ (32 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గగా రాణించలేకపోయారు. వార్నర్‌ (29), మార్ష్‌ (20), షాయ్‌ హోప్‌ (33), అక్షర్‌లకు (21) శుభారంభాలు అందినప్పటికీ వారు వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌  యాదవ్‌ (4-0-20-2), అక్షర్‌ పటేల్‌ (4-0-25-0), ఇషాంత్‌ శర్మ (2-0-16-1) పర్వాలేదనిపించగా.. ఖలీల్‌ అహ్మద్‌ (4-0-43-2), మిచెల్‌ మార్ష్‌ (4-0-52-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement