
Australia tour of South Africa, 2023 ODI Series: ఆస్ట్రేలియాతో సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రొటిస్ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. వెన్ను నొప్పి తీవ్రతరమైన కారణంగా ఆసీస్‌తో మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసింది.
టీ20 సిరీస్‌లో ఘోర పరాభవం
కాగా మూడు టీ20లు, 5 వన్డేల సిరీస్ కోసం కంగారూ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగష్టు 30న మొదలైన టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టును ఆసీస్.. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అదే విధంగా తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉంది.
ముఖ్యంగా శనివారం నాటి రెండో వన్డేలో ఏకంగా 123 పరుగుల తేడాతో గెలుపొంది ఫుల్ జోష్‌లో ఉంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. ఐదు ఓవర్లు వేసిన తర్వాత మైదానాన్ని వీడిన ఈ రైట్‌ఆర్మ్ పేసర్.. తర్వాత తిరిగొచ్చి ఫీల్డింగ్ చేశాడు.
వెన్నునొప్పి తీవ్రతరం
అయితే.. నొప్పి తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం.. 29 ఏళ్ల నోర్జేను సోమవారం జొహన్నస్‌బర్గ్‌కు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో వైద్యపరీక్షలు జరుగుతున్న సమయంలో.. అతడు సెప్టెంబరు 12 నాటి మూడో వన్డేకు దూరం కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక వన్డే సిరీస్‌లో ఇప్పటికే వెనుబడ్డ సౌతాఫ్రికాకు.. వన్డే వరల్డ్‌కప్-2023 సమీపిస్తున్న తరుణంలో నోర్జే గాయం అశనిపాతంలా మారింది.
శ్రీలంకతో తొలి మ్యాచ్.. వరల్డ్‌కప్‌నకు ముందు ఎదురుదెబ్బ
ప్రొటిస్ కీలక పేసర్లలో ఒకడైన అన్రిచ్ నోర్జే గనుక మెగా ఈవెంట్ నాటికి అందుబాటులోకి రాకుంటే జట్టుకు కష్టాలు తప్పవు. ఇక భారత్ వేదికగా మొదలు కానున్న ప్రపంచకప్ టోర్నీలో అక్టోబరు 7న ఢిల్లీలో శ్రీలంకతో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆసీస్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే మూడో వన్డే తప్పక గెలవాల్సి ఉంది.
వన్డే వరల్డ్‌కప్‌నకు సౌతాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్.
చదవండి: చిక్కుల్లో పాక్ క్రికెట్ జట్టు.. ఐసీసీ సీరియస్! ఏమైందంటే?
Comments
Please login to add a commentAdd a comment