సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ను ముంబై కేప్ టౌన్ తిరిగి నియమించింది. కాగా తొట్ట తొలి సీజన్‌లో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్.. గాయం కారణంగా రెండో సీజన్‌కు దూరమయ్యాడు.
ఇప్పుడు వచ్చే ఏడాది సీజన్‌కు అతడు అందుబాటులోకి రావడంతో మరోసారి కేప్‌టౌన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. తొలి సీజన్‌లో అతడి సారథ్యంలోని కేప్ టౌన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచి గ్రూపు స్టేజిలోనే రషీద్ జట్టు ఇంటిముఖం పట్టింది. రెండో సీజన్‌లో కూడా ముంబై తలరాత మారలేదు.
రషీద్ స్ధానంలో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా విండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్ వ్యవహరించాడు. రెండో సీజన్‌లో కూడా ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికే పరిమితమైంది. కనీసం మూడో స్ధానంలోనైనా ముంబై కేప్ టౌన్ తలరాత మారుతుందో లేదో చూడాలి.
కాగా ఎస్ఏ 20-2025 సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై కేప్‌టౌన్ జట్టులో స్టోక్స్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కాగా ముంబై కేప్‌టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందినదే అన్న విషయం తెలిసిందే. ఇక ఎస్ఎ టీ20 లీగ్ మూడో సీజన్ జనవరి 9, 2025న ప్రారంభం కానుంది.
ఎస్‌ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు..
బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్‌గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్‌హ్యుజెన్
చదవండి: అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment