భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్‌లో పార్ల్ రాయల్స్ తరపున కార్తీక్ ఆడనున్నాడు. వచ్చే ఏడాది సీజన్‌కు గాను విదేశీ ప్లేయర్ కోటాలో డీకేతో పార్ల్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది.
తద్వారా ఎస్ఎ టీ20లో ఆడనునున్న తొలి భారత ఆటగాడిగా కార్తీక్ నిలిచాడు. కాగా ఐపీఎల్-2024 అనంతరం అన్నిరకాల క్రికెట్ ఫార్మాట్‌లకు కార్తీక్ విడ్కోలు పలికాడు. కాగా భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే కచ్చితంగా అన్ని ఫార్మాట్లకు ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే.
ఈ క్రమంలోనే కార్తీక్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడే ఛాన్స్ లభించింది. ఇక ఇటీవలే ఎస్ఎ టీ20 టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా కార్తీక్ ఎంపికయ్యాడు. కాగా టీ20ల్లో కార్తీక్‌కు అపారమైన అనుభవం ఉంది. తన కెరీర్‌లో 401 టీ20లు ఆడిన డీకే.. 136.96 స్ట్రైక్-రేట్‌తో 7407 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో ఏకంగా ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అదే విధంగా భారత్ తరుపన దినేష్ 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కాగా డీకేతో పాటు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్‌ను కూడా పార్ల్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది.
పార్ల్ రాయల్స్ జట్టు
డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, దినేష్ కార్తీక్, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడి యూసుఫ్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, దయాన్ గలీమ్
చదవండి: 'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు'
Comments
Please login to add a commentAdd a comment