![Ben Stokes, Omarzai Signed Up By MI Cape Town For SA20 2025](/styles/webp/s3/article_images/2024/08/14/asx.jpg.webp?itok=Yck9xfxJ)
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్ కోసం ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ జట్టుకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. స్టోక్స్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ను కూడా ఎంపిక చేసుకుంది ఎంఐ కేప్‌టౌన్ యాజమాన్యం. ఈ జట్టులో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, రస్సీ వాన్ వర్ డస్సెన్, డెవాల్డ్ బ్రెవిస్, నువాన్ తషార లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు.
14 మంది సభ్యుల జట్టును ఎంఐ కేప్‌టౌన్ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. కాగా, బెన్ స్టోక్స్ తాజాగా హండ్రెడ్ లీగ్ ఆడుతూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో స్టోక్స్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
ఇదిలా ఉంటే, ఆరు ఫ్రాంచైజీలు పాల్గొనే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు రెండు ఎడిషన్లు జరిగాయి. రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఫ్రాంచైజీనే విజేతగా నిలిచింది. ఎస్‌ఏ20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న మొదలై ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ఎంఐ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పాల్గొంటాయి.
ఎస్‌ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు..
బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్‌గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్‌హ్యుజెన్
Comments
Please login to add a commentAdd a comment