IPL 2022 PBKS Vs MI: Dewald Brevis Hits Longest Six Of IPL, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022 PBKS Vs MI: దటీజ్‌ జానియర్‌ 'ఏబీ'.. ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌.. వైరల్‌

Published Thu, Apr 14 2022 11:48 AM | Last Updated on Thu, Apr 14 2022 12:33 PM

Dewald Brevis hits longest six of IPL 2022 during MI PBKS clash - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు జానియర్‌ 'ఏబీ' డెవాల్డ్ బ్రెవిస్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్రెవిస్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌కు చుక్కలు చూపించాడు. ముంబై ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ వేసిన రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, 1 ఫోర్‌ బాది  బ్రెవిస్‌ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు.

ఈ ఓవర్‌లోనే నాలుగో బంతికి  బ్రెవిస్‌ 112 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా బ్రెవిస్‌  నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ లివింగ్ స్టోన్ 108 మీటర్ల దూరంతో భారీ సిక్స్ బాదిన సంగతి తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్‌లో  49 పరుగులు సాధించిన బేబి 'ఏబీ' కేవలం ఒక్క పరుగు దూరంలోను తన తొలి అర్ధ సెంచరీను చేజార్చుకున్నాడు. ఇక ఈ ​‍మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో 12 పరుగల తేడాతో ముంబై ఓటమి పాలైంది. కాగా ఈ సీజన్‌లో వరసుగా ఐదో మ్యాచ్‌లో ముంబై ఓటమి చెందడం గమనార్హం.

చదవండి: IPL 2022 MI Vs PBKS: ఒకే ఓవర్‌లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement