
ఐపీఎల్-2025కు ముందు హ్యారీ బ్రూక్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ అనూహ్యంగా ఈ ఏడాది సీజన్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. గతేడాది సీజన్ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకున హ్యారీ బ్రూక్.. ఈ ఏడాది సీజన్‌కు అందుబాటులో ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం భావించింది.
ఈ క్రమంలో గత డిసెంబర్‌లో జరిగిన మెగా వేలంలో రూ. 6.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది. కానీ ఈసారి కూడా అతడు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో అతడిపై బీసీసీఐ రెండేళ్ల పాటు నిషేదం విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ హ్యారీ బ్రూక్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది.
బ్రెవిస్‌పై కన్ను.. ?
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌తో హ్యారీ బ్రూక్ స్ధానాన్ని భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 75 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన బ్రెవిస్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
అయితే ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 21 ఏళ్ల బ్రెవిస్ దుమ్ములేపాడు. బ్రెవిస్ మిడిలార్డర్‌లో వచ్చి అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ టోర్నీలో ఏంఐ కేప్ టౌన్ తరపున 12 మ్యాచ్‌లు ఆడిన బ్రెవిస్.. 184.17 స్ట్రైక్ రేట్‌తో 291 పరుగులు చేశాడు. బ్రెవిస్‌తో బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తాఉంది.
ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది. బ్రెవిస్ ఐపీఎల్‌లో గతసీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో బ్రెవిస్‌ను మూడు కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.
ఆ తర్వాత ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ముంబై విడిచిపెట్టింది. ఇక ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.
2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..
ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్
చదవండి: IPL 2025: 'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి'
Comments
Please login to add a commentAdd a comment