Courtesy: IPL Twitter
ఐపీఎల్‌లో గత సీజన్ వరకు తన విధ్వంసక ఆటతో అభిమానులను అలరించిన ఏబీ డివిలియర్స్ ఈ సారి నుంచి దూరమయ్యాడు. అయితే అతడిని గుర్తు చేసేలా 18 ఏళ్ల దక్షిణాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు బ్రెవిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెవిస్ విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 49 పరుగులు సాధించి ముంబై విజయంపై ఆశలు రేకెత్తించాడు.
కాగా రాహుల్ చహర్ ఓవర్లో బ్రెవిస్ వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 6, 6 (మొత్తం 28 పరుగులు) బాదడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెవిస్(49), సుర్యకూమార్ యాదవ్(43) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ముంబై కు విజయం వరించలేదు. పంజాబ్ కింగ్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై పరాజాయం పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్‌లో వరుసగా ఐదో ఓటమిని ముంబై చవి చూసింది.
చదవండి: IPL 2022: తీరు మారని ముంబై ఇండియన్స్.. వరుసగా ఐదో ఓటమి.. పంజాబ్ ఘన విజయం
1, 4, 6, 6, 6, 6
— Pritam Biswas (@pritambiswas_18) April 13, 2022
Baby AB" Dewald Brevis is putting up a batting show against PBKS 🔥💥#DewaldBrevis #BabyAB #IPL2022 #MIvsRCB pic.twitter.com/1916DYWONK
Comments
Please login to add a commentAdd a comment