PC: CSA Twitter
ఐపీఎల్.. కాసులు కురిపించే లీగ్... ఒక్కసారి ఇందులో ప్రతిభ నిరూపించుకుంటే చాలు కావాల్సినంత డబ్బు... పాపులారిటీకి పాపులారిటి వస్తాయి. మరి ఇలాంటి క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనాలని ఆటగాళ్లు కోరుకోవడం సహజమే కదా! దక్షిణాఫ్రికా యువ సంచలనం డేవాల్డ్ బ్రెవిస్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఐపీఎల్‌లో తనకు ఆడాలని ఉందని, అవకాశం వస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడతానని చెప్పుకొచ్చాడు.
వెస్డిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్ టోర్నీలో బ్రెవిస్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆడిన 4 మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించాడు. లీగ్ స్టేజ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో బ్రెవిస్ ఆట తీరు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌ను గుర్తు చేస్తోందంటూ.. అతడికి ఏబీడీ 2.0గా పేరు పెట్టారు ఫ్యాన్స్. అంతేగాక అతడు ఆర్సీబీ జెర్సీలో ఉన్న ఫొటో కంటపడటంతో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బ్రెవిస్ ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ... అన్ని ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. అదే విధంగా ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లి తన ఫేవరెట్ క్రికెటర్లు అన్న బ్రెవిస్... ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే... ఆర్సీబీకి ఆడతానని పేర్కొన్నాడు. ఈ మేరకు... ‘‘ప్రొటిస్‌కు ఆడటం తన అతిపెద్ద కల. ఐపీఎల్‌కు నేను పెద్ద అభిమానిని. ఏబీడీ, కోహ్లి వంటి దిగ్గజాలు ఆడిన ఆర్సీబీకి ఆడటాన్ని నేను ఇష్టపడతా. ఆల్‌రౌండర్‌గా ఎదిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు... ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లలోనూ ఆడాలని భావిస్తున్నా’’ అని బ్రెవిస్ తమ మనసులోని భావాలు పంచుకున్నాడు.
చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా?
India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి
Meet Dewald Brevis the mini AB playing for South Africa U-19 team. His last few scores in the U-19 W C 👇
— Ahmer Najeeb Raja (@ahmersatti90) January 26, 2022
97, 96, 104, 65, 50#ENGvSA #U19WorldCuppic.twitter.com/fdfGYleIR7
Comments
Please login to add a commentAdd a comment