
Courtesy: IPL Twitter
ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బుధవారం(ఏప్రిల్ 6) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతులు ఆడిన బ్రెవిస్ 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే అతడు బాదిన ఓ సిక్సర్ మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇన్నింగ్స్ 8 ఓవర్ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో.. బంతిని చూడకుండానే బ్రెవిస్ అద్భుతమైన సిక్స్ బాదాడు.
కాగా అదే ఓవర్‌లో ఐదో బంతికి బ్రెవిస్ స్టంపౌట్‌గా వెనుదిరిగడం గమనార్హం. బ్రెవిస్ సిక్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దక్షణాఫ్రికాకు చెందిన ఈ యువ ఆటగాడిని అభిమానులు "జూనియర్ ఏబీగా" పిలుచుకుంటున్నారు. అండర్-19 ప్రపంచకప్‌లో కూడా బ్రెవిస్ అదరగొట్టాడు. ఐపీఎల్‌లో మెగా వేలంలో అతడిని రూ. 3కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
చదవండి: IPL 2022: బుమ్రాకు అక్షింతలు.. నితీష్ రాణాకు జరిమానా!
— Jemi_forlife (@jemi_forlife) April 6, 2022