IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ | IPL 2024 MI VS SRH: Rohit Sharma Will Be Playing His 200th Game For Mumbai Indians In IPL | Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ

Published Wed, Mar 27 2024 5:37 PM | Last Updated on Wed, Mar 27 2024 7:55 PM

IPL 2024 MI VS SRH: Rohit Sharma Will Be Playing His 200th Game For Mumbai Indians In IPL - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాళ (మార్చి 27) జరుగబోయే మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చిరస్మరణీయంగా మారనుంది. ఈ మ్యాచ్‌ హిట్‌మ్యాన్‌కు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున 200వ మ్యాచ్‌. ఐపీఎల్‌ చరిత్రలో రోహిత్‌కు ముందు విరాట్‌ కోహ్లి (ఆర్సీబీ, 239 మ్యాచ్‌లు), ఎంఎస్‌ ధోని (సీఎస్‌కే, 222 మ్యాచ్‌లు) మాత్రమే ఓ ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్‌లు ఆడారు.

ఓవరాల్‌గా హిట్‌మ్యాన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 244 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 130.2 స్ట్రయిక్‌రేట్‌తో 29.6 సగటున సెంచరీ, 42 హాఫ్‌ సెంచరీల సాయంతో 6254 పరుగులు చేశాడు. పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అయిన రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ కూడా నమోదు చేశాడు. 2009 సీజన్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌కు (నేటి సన్‌రైజర్స్‌) ప్రాతినిథ్యం వహించిన రోహిత్‌.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సహా ఐదు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. హిట్‌మ్యాన్‌ ఖాతాలో ఓవరాల్‌గా 15 ఐపీఎల్‌ వికెట్లు ఉన్నాయి. 36 ఏళ్ల రోహిత్‌ ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ (2008-2010), ముంబై ఇండియన్స్‌కు (2011-) ప్రాతినిథ్యం వహించాడు.

నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో సన్‌రైజర్స్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై బోణీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. సన్‌రైజర్స్‌ తమ తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ చేతిలో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయంపాలైంది. తొలి మ్యాచ్‌లో దెబ్బతిన్న ఇరు జట్లు బలాబలాల విషయంలో సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement