కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్‌ శర్మ.. డ్రెస్సింగ్‌ రూంలో అలా! | MI Vs SRH 2024: Rohit Sharma Crying Inside MI Dressing Room After His Dismissal, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Published Tue, May 7 2024 3:45 PM | Last Updated on Tue, May 7 2024 3:58 PM

Rohit Sharma Breaks Down in MI Dressing Room Indian Captain Visuals Viral

ఐపీఎల్‌-2024 టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్‌ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌  కెప్టెన్‌ పదవిని కోల్పోయిన హిట్‌మ్యాన్‌.. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

కానీ బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్‌ శర్మ చేసిన పరుగులు 330. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదిహేడో స్థానం(మే 7 నాటికి)లో ఉన్నాడు.

ఆ సెంచరీ మినహా!
ఈ ఎడిషన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మీద సాధించిన శతకం(105 నాటౌట్‌) మినహా మిగతా మ్యాచ్‌లలో రాణించలేకపోయాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో సోమవారం ముగిసిన మ్యాచ్‌లోనూ రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు.

భావోద్వేగానికి గురైన రోహిత్‌!
వాంఖడే మైదానంలో ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. కేవలం ఒక్క ఫోర్‌ కొట్టి అవుటయ్యాడు. రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ నేపథ్యంలో నిరాశగా మైదానం వీడిన రోహిత్‌ శర్మ డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించాడు. దుఃఖాన్ని ఆపుకొంటూ రోహిత్‌ కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాపం రోహిత్‌
ఈ వీడియో చూసిన రోహిత్‌ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు నిన్నిలా చూడలేకపోతున్నాం హిట్‌మ్యాన్‌. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ నిర్ణయం వల్లే ఇదంతా. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించి అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు.

ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌పై వేటు వేశారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు’’ అంటూ ముంబై జట్టు మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. 

ఏదేమైనా రోహిత్‌ శర్మ వైఫల్యాలను అధిగమించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో విజయం అందుకుంది. 

చదవండి: ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement