ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయిదేదీప్య ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నీలో మెరిసింది. పుణెలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు, డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సింగిల్స్‌లో ఓడిన మరో ఏపీ అమ్మాయి శ్రీవల్లి రష్మిక డబుల్స్‌లో సెమీస్‌కు చేరింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సాయిదేదీప్య 6-3, 6-1తో పాన్య భల్లాపై, రాష్ట్రానికి చెందిన ఐదో సీడ్ అమినేని శివాని 6-3, 6-3తో ఆద్యా చల్లాపై గెలుపొందారు. శ్రీవల్లి 1-6, 2-6తో ఏడో సీడ్ ప్రకృతి భన్వాని చేతిలో ఓడింది.
బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి-పాన్య భల్లా జోడి 6-1, 7-5తో నేహా గరే- శరణ్య జంటపై విజయం సాధించగా, సాయిదేదీప్య-ఈశ్వరి మాత్రే జంట 6-4, 6-1తో శ్రేయ సగాడే-రుతూజ జాదవ్ ద్వయాన్ని ఓడించింది. అమినేని శివాని-ఇషితా పరేఖ్ జోడి 6-4, 6-0తో నేహ మొకాషి- పరాడే జంటపై గెలిచింది.
క్వార్టర్స్‌లో సాయిదేదీప్య
Published Fri, Apr 18 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement
Advertisement