టెన్నిస్ చాంప్ హర్షిత్ | Tennis champ harisht | Sakshi
Sakshi News home page

టెన్నిస్ చాంప్ హర్షిత్

Published Sun, Sep 29 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

Tennis champ harisht

 జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో బాలుర అండర్-12 విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు హర్షిత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. బోయిన్‌పల్లిలో సూర్య టెన్నిస్ అకాడమీ నిర్వహించిన ఈ టోర్నీలో శనివారం జరిగిన ఫైనల్లో హర్షిత్ 6-3, 0-6, 6-1తో ప్రీతమ్‌పై విజయం సాధించాడు. బాలికల విభాగంలో సంస్కృతి (ఏపీ) 6-4, 6-0తో సాహితి రెడ్డిని ఓడించి ంది.
 
 బాలుర అండర్-14 విభాగంలో అనికేత్ (ఆంధ్రప్రదేశ్) 6-2, 6-3తో సాయి కార్తీక్ (ఏపీ)పై, బాలికల విభాగంలో శ్రావ్య శివాని (ఏపీ) 6-1, 6-1తో ఉమర్ మిష్‌గాన్ (ఏపీ)పై గె లిచింది. అండర్-12 బాలుర డబుల్స్ విభాగంలో ఆదర్శ్-అనురాగ్ అగర్వాల్ జోడి 6-4, 4-6, 6-4తో హర్షిత్-ఆకాష్ జోడిపై నెగ్గింది. అండర్-14 బాలికల విభాగంలో చరిత-లిపిక జోడి 6-4, 4-6, 10-5తో సాహితి రెడ్డి- అనన్య మోహన్ జోడిపై గెలుపొందింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement