under-14
-
వయసు దాటినవారు 51 మంది...
తిరుపతి: క్రీడల్లో తప్పుడు వయోధ్రువీకరణ పత్రాలతో తక్కువ వయసు స్థాయి పోటీల్లో పాల్గొనడటం తరచుగా జరుగుతూనే ఉంది. ఇలాంటిదే ఇటీవల జరిగిన ఒక ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తిరుపతి వేదికగా నవంబర్ 24 నుంచి 26 మధ్య వరకు జరిగిన జాతీయ జూనియర్ అంతర్ జిల్లా అథ్లెటిక్స్ మీట్లో ఇది చోటు చేసుకుంది. అండర్–14, అండర్–16 విభాగాల్లో పోటీ పడటానికి దేశవ్యాప్తంగా 494 జిల్లాలకు చెందిన 4500 మంది అథ్లెట్లు ఈ మీట్లో పాల్గొన్నారు. అయితే వీరి వయసును తెలుసుకోవడానికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వారికి వయసు నిర్ధారిత పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగా అథ్లెట్లకు దంత పరీక్షలు, టానర్ వైట్‌హౌస్ (టీడబ్ల్యూ3– ఎక్స్‌రే ద్వారా ఎముక వయసును కనుగొనే పద్ధతి) పరీక్షలు నిర్వహించగా... అందులో 51 మందికి ఎక్కువ వయసు ఉన్నట్లు తేలింది. వీరంతా తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలతో పోటీల్లో పాల్గొంటున్నట్లు ఏఎఫ్ఐ కనిపెట్టింది. మరో 169 మంది పరీక్షల్లో పాల్గొనకుండా ముందే తప్పించుకున్నట్లు ఏఎఫ్ఐ వయసు నిర్ధారిత పరీక్షల నిర్వహణాధికారి రాజీవ్ ఖత్రి తెలిపారు. దీనిపై ఆయా రాష్ట్రా ల వివరణను కోరనున్నట్లు ఏఎఫ్ఐ స్పష్టం చేసింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వేదికగా జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్ లో కూడా దాదాపు 100 మంది ప్లేయర్లు తప్పుడు వయసుతో పోటీల్లో పాల్గొంటూ పట్టుబడ్డారు. -
జిషిత...విశ్వవిజేత
అంతర్జాతీయ చెస్ వేదికపై మరో తెలుగు తేజం మెరిసింది. గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బాటలో పయనిస్తూ 13 ఏళ్ల ధనుమూరి జిషిత విశ్వవిజేతగా అవతరించింది. ఉరుగ్వేలో ముగిసిన ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అండర్–14 బాలికల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఆసియా చాంపియన్ హోదాలో ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్న జిషిత అంచనాలకు అనుగుణంగా రాణించి తొమ్మిది పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్‌కు స్వర్ణం, రెండు రజతాలు లభించాయి. అండర్–14 ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్, అండర్–18 బాలికల విభాగంలో మహారాష్ట్ర అమ్మాయి సాక్షి చిత్లాంగె రన్నరప్‌గా నిలిచి రజత పతకాలను గెల్చుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రపంచ చదరంగంలో మరోసారి తెలుగు తేజానికి పట్టం లభించింది. ఉరుగ్వే రాజధాని మాంటివీడియోలో ముగిసిన ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ధనుమూరి జిషిత అండర్–14 బాలికల విభాగంలో టైటిల్‌ను దక్కించుకుంది. నిర్ణీత 11 రౌండ్లకుగాను జిషిత తొమ్మిది పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు గ్రామానికి చెందిన జిషిత తొమ్మిది గేముల్లో గెలిచి, మిగతా రెండు గేముల్లో ఓడిపోయింది. రమోనా (లాత్వియా), అల్వా గ్లింజ్నెర్ (జర్మనీ), అనాపావోలా (అర్జెంటీనా), స్విత్లానా (కెనడా), ఐరిస్ జూ (అమెరికా), సిండీ జాంగ్ (అమెరికా), మృదుల్ దేహాంకర్ (భారత్), సలీమోవా (బల్గేరియా), యాసమిన్ (అమెరికా)లపై నెగ్గిన జిషిత... బిబిసారా (రష్యా), దరియా మిరునా (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో జిషిత ఆంధ్రప్రదేశ్ నుంచి అండర్–14 బాలికల విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2000లో స్పెయిన్‌లో), ద్రోణవల్లి హారిక (2004లో గ్రీస్‌లో) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా భారత్ నుంచి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆరో క్రీడాకారిణి జిషిత. హంపి, హారికలతోపాటు పద్మిని రౌత్ (2008లో), మహాలక్ష్మి (2012లో), వైశాలి (2015లో) కూడా టైటిల్స్‌ను సాధించారు. ప్రపంచ చాంపియన్‌గా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు, రమాజ్యోతి నిరంతర ప్రోత్సాహం... కోచ్ రామరాజు అద్భుత శిక్షణతో నిలకడగా విజయాలు సాధిస్తున్నాను. అమ్మ చెస్ ఆడుతుండగా ఈ ఆటపై నాకు ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత సీరియస్‌గా దృష్టి సారించి తొలుత స్కూల్‌స్థాయి టోర్నీల్లో పాల్గొన్నాను. అనంతరం నా ఆటలోని లోపాలను సవరించుకుంటూ గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో టైటిల్స్ సాధిస్తున్నాను. గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్–13 విభాగంలో స్వర్ణం, ఈ ఏడాది ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా యూత్ పోటీల్లో అండర్–14 విభాగంలో స్టాండర్డ్, బ్లిట్జ్ ఈవెంట్స్‌లో స్వర్ణాలు గెలిచాను. హంగేరి చెస్ దిగ్గజం జూడిత్ పోల్గర్‌ను అభిమానిస్తాను. మహిళా అంతర్జాతీయ మాస్టర్ (డబ్ల్యూఐఎం), మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) హోదాలు సంపాదించాడమే నా తదుపరి లక్ష్యం. ఈ ఈవెంట్లో ఒకానొక దశలో పతకంపై ఆశలు కోల్పోయాను. ఆ సమయంలో కోచ్ రామరాజు సూచనలు, తల్లిదండ్రుల మద్దతుతో ఒత్తిడికి లోనుకాకుండా ఆడి వరుసగా ఐదు గేముల్లో గెలిచి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాను. –‘సాక్షి’తో జిషిత రన్నరప్ అర్జున్ మరోవైపు అండర్–14 ఓపెన్ విభాగంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 11 రౌండ్లు పూర్తయ్యాక అర్జున్ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు. ఏడు గేముల్లో గెలుపొందిన అర్జున్, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలువడం విశేషం. నెస్సి డేవిడ్ (నార్వే), ఆండ్రీ క్రిస్టియన్ (రొమేనియా), యువాన్ మార్టిన్ (అర్జెంటీనా), రోహన్ తాలుక్దార్ (కెనడా), నోవా ఫెకెర్ (స్విట్జర్లాండ్), కౌస్తవ్ చటర్జీ (భారత్), సచా బ్రోజెల్ (ఇంగ్లండ్)లపై నెగ్గిన ఈ హన్మకొండ కుర్రాడు జాన్ సుబెల్జ్ (స్లొవేనియా), డొమినిక్ హోర్వత్ (ఆస్టియా), బత్సురెన్ దంబాసురెన్ (మంగోలియా), పావెల్ టెక్లాఫ్ (పోలాండ్)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. 10 పాయింట్లతో బత్సురెన్ దంబాసురెన్ టైటిల్ దక్కించుకోగా... 8.5 పాయింట్లతో పావెల్ టెక్లాఫ్ కాంస్య పతకాన్ని సంపాదించాడు. అండర్–18 బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సాక్షి చిత్లాంగె ఎనిమిది పాయింట్లతో రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సాధించింది. ఒక్కో అడుగు ముందుకేస్తూ... ఐదేళ్ల క్రితం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సెలెక్షన్ టోర్నీలో విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చిన అర్జున్ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆశాకిరణంగా ఎదిగాడు. తల్లిదండ్రులు డాక్టర్ శ్రీనివాసరావు, జ్యోతిల ప్రోత్సాహంతో చెస్‌పై మరింత మక్కువ పెంచుకున్నాడు. తన నైపుణ్యానికి పదును పెట్టి గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్–13 విభాగంలో చాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పోటీల్లో కనబరిచిన ప్రదర్శనతో అతను ఆసియా, ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించాడు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా యూత్ పోటీల్లో అర్జున్ అండర్–14 విభాగంలో విజేతగా నిలిచాడు. అదే జోరును ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లోనూ కొనసాగించి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మిడిల్, ఎండ్ గేమ్‌లో చక్కగా రాణించే అర్జున్‌కు మున్ముందు తగిన ప్రోత్సాహం లభిస్తే ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న అతడిని భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్‌గా చూసే అవకాశముంది. -
బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
చాగల్లు : అండర్–14 స్కూల్‌గేమ్స్ జిల్లా స్థాయి బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా వ్యాయామ ఉపా«ధ్యాయుల సంఘం అధ్యక్షుడు మరడాని అచ్యుత్, స్కూల్‌గేమ్స్ జిల్లా కార్యదర్శి ఎ.సాయి శ్రీనివాస్ ముఖ్య అతి«థులుగా హాజరై పర్యవేక్షించారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెలక్షన్ కమిటీ కన్వీనర్ సీహెచ్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు నవంబర్ నెలలో పెంటపాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి.అనిల్‌కుమార్, వట్టికూటి సత్యనారాయణ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ∙బాలుర విభాగం జట్టు జి.కరుణ్య, యు.నితిన్, ఎం.రోహిణీకుమార్ (చాగల్లు), బి.రాహుల్(గౌరీపట్నం), యు.నరేష్ (బ్రాహ్మణగూడెం), కె.వెంకట రమణ (మద్దూరు), ఎస్.భార్గవ (పెంటపాడు), ఎం.సతీష్ (సమిశ్రగూడెం) ∙బాలికల విభాగం సీహెచ్ శ్రీజ, బి.స్వాతి (చాగల్లు), కె.శ్యామ్, ఎస్.పూజిత, ఎస్కే షలాంబి (పెంటపాడు), కె.జ్యోతి (శెట్టిపేట), ఎం.హిమవతి (తాళ్లపూడి), జె.జయరేఖ(ఊనగట్ల) ఎంపికయ్యారు. -
20న అండర్–14 వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: నారాయణపేటలోని మినీ స్టేడియంలో ఈనెల 17న నిర్వహించాల్సిన అండర్–14 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ బాల, బాలికల జట్ల ఎంపికలు వర్షాల కారణంగా 20న నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని, మిగతా వివరాలకు రమణ సెల్ నెం : 9985250389 ను సంప్రదించాలని ఆయన కోరారు. -
జిల్లా టెన్నీకాయిట్ జట్లు ఇవే
నూజివీడు : టెన్నీకాయిట్ అండర్–14 జిల్లా బాల బాలికల జట్లను పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన సెలక్షన్లో ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ కార్యదర్శి డీ. సూర్యనారాయణ తెలిపారు. బాలుర జట్టు: జీ రమేష్, ఎన్. నవీన్, పీ. ఫణీంద్ర, ఎం. హరీష్, బీ. దుర్గారావు, పీ. కార్తీక్, కే తారక్, ఎం విశాల్. బాలికల జిల్లా జట్టుకు జీ. స్వాతి, జే. హరిణి, జే. రాజేశ్వరి, సీహెచ్. శ్రావణి, ఎం. సునంద, జీ. నిఖిత, యూ. ప్రవల్లిక, రవళి ఎంపికయ్యారు. -
జాతీయ అండర్-14 చాంప్ సాత్విక
న్యూఢిల్లీ: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ అమ్మాయి సామ సాత్విక జాతీయ అండర్-14 చాంపియన్‌గా అవతరించింది. శనివారం ముగిసిన జాతీయ జూనియర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో సాత్విక 6-2, 6-2తో సభ్యత నిహలాని (ఢిల్లీ)పై అలవోకగా గెలిచింది. అండర్-16 బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ కుర్రాడు బీఆర్ నిక్షేప్ రన్నరప్‌గా నిలిచాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ నిక్షేప్ 6-2, 2-6, 5-7తో రెండో సీడ్ చెరుకు వశిష్ట్ వినోద్ (కర్ణాటక) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
ఆకాశ్, అనన్యలకు టైటిల్స్
అండర్-14 టెన్నిస్ టోర్నీ ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ అండర్-14 టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎల్. ఆకాశ్ రెడ్డి, అనన్య మోహన్ విజేతలుగా నిలిచారు. ఇమాన్యుయెల్ కోచింగ్ సెంటర్, సూర్యోదయ టెన్నిస్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్‌ను ఆకాశ్, బాలికల టైటిల్‌ను అనన్య కైవసం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని అకాడమీలో మంగళవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఆకాశ్ రెడ్డి 3-6, 7-6, 6-4తో అమన్ అయూబ్‌ఖాన్‌పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో అతను 5-3, 4-1తో చింతా ప్రణవ్‌పై, అయూబ్ ఖాన్ 4-2, 4-2తో లంక సుహిత్రెడ్డి పై గెలిచారు. బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో అనన్య మోహన్ 6-1, 6-3తో దామెర సంస్కృతిపై గెలిచింది. సెమీఫైనల్లో ఆమె 4-0, 4-0తో లిపిక మురమాలపై, సంస్కృతి 4-2, 3-5, 4-1తో సాహితిరెడ్డిపై గెలుపొందారు. అంతకుముందు జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్లో అకాశ్ 7-3తో రుచిత్ గౌడ్‌పై, అయూబ్ ఖాన్ 7-2తో పి.కౌశల్‌పై, సుహిత్రెడ్డి 7-4తో వల్లభనేని ప్రీతమ్‌పై, ప్రణవ్ 7-4తో లోకాదిత్య వర్ధన్‌పై నెగ్గారు. బాలికల క్వార్టర్స్‌లో సంస్కృతి 8-4తో లాస్య పట్నాయక్‌పై, అనన్య మోహన్ 8-2తో కె.అవంతికరెడ్డిపై, లిపిక 8-4తో పి.అమూల్యపై నెగ్గారు. -
సెమీస్‌లో శివాని
ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి అమినేని శివాని సత్తాచాటింది. చండీగఢ్‌లోని సీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో రెండో సీడ్ శివాని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మిగతా సహచరులు శ్రీవల్లి రష్మిక, టాప్ సీడ్ సాయిదేదీప్య నిరాశపరిచారు. క్వార్టర్స్‌లోనే కంగుతిన్నారు. డబుల్స్‌లో సాయిదేదీప్య-మహక్ జైన్ జోడి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శివాని 7-5, 6-3తో ఎనిమిదో సీడ్ ఈశ్వరి మాటెరేపై నెగ్గింది. శివాని 3-6, 1-6తో నాలుగో సీడ్ మహక్ జైన్ చేతిలో, సాయి దేదీప్య 5-7, 7-5, 4-6తో ఆరో సీడ్ ప్రింకిల్ సింగ్ చేతిలో పరాజయం చవిచూశారు. దేదీప్య తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది. డబుల్స్ ఈవెంట్లో మహక్ జైన్‌తో జతకట్టిన సాయిదేదీప్య 6-1, 6-1తో ఈశ్వరి మాటెరే-అయేషా పటేల్ జంటపై అలవోక విజయం సాధించింది. శ్రీవల్లి రష్మిక-పాన్యభల్లా ద్వయం 6-2, 6-1తో అశ్‌ప్రీత్ కౌర్-తనీషా బన్సాల్ జంటపై, శ్రావ్యశివాని-శరణ్యషెట్టి జోడి 6-0, 6-2తో నికితాదేవి-ప్రిన్సీ పాంచాల్ ద్వయంపై, శివాని-ప్రింకిల్ సింగ్ జంట 6-1, 6-2తో కుశ్‌బీన్ కౌర్-రాహమంగత్ జోడిపై గెలుపొందాయి. -
క్వార్టర్స్‌లో సాయిదేదీప్య, శివాని
ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు సాయిదేదీప్య, అమినేని శివాని, శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చండీగఢ్‌లోని సీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శివాని 6-1, 6-0తో పాశ్చల్పై అలవోక విజయం సాధించగా, శ్రీవల్లి రష్మిక 2-6, 6-4, 6-2తో ఏడో సీడ్ పాన్యబాలపై చెమటోడ్చి నెగ్గింది. ఇతర పోటీల్లో టాప్ సీడ్ సాయిదేదీప్య 4-6, 6-2, 6-3తో అయేషా పటేల్‌పై గెలుపొందగా, ఆరో సీడ్ ప్రింకిల్ సింగ్ 6-3, 6-1తో శ్రావ్య శివానిని ఓడించింది. నాలుగో సీడ్ మహక్ జైన్ 6-0, 6-0తో శరణ్య షెట్టిపై, ప్రకృతి భన్వాని 6-0, 6-1తో నికితా దేవిపై, ఆర్.జాదవ్ 6-1, 6-1తో అశ్‌ప్రీత్ కౌర్‌పై, ఈశ్వరి మాటెరే 6-2, 6-4తో కుశ్‌బీన్ కౌర్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించారు. బాలికల అండర్-14 డబుల్స్ తొలిరౌండ్లో శ్రీవల్లి-పాన్యబాల జోడి 6-7, (4/7), 7-6 (7/4), 10-5తో అశ్ప్రీత్కౌర్-అలీషా మీనన్ జంటపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సాయి దేదీప్య-మహక్ జైన్ జోడికి, ప్రింకిల్ సింగ్-శివాని జంటకు తొలి రౌండ్లో బై లభించింది. ఈశ్వరి మాటెరే-అయేషా పటేల్ ద్వయం 6-1, 6-0తో ఐశ్వర్య- ఎస్.మెహతా జోడిపై, తనీషా బన్సాల్-రియా జంట 6-2, 6-2తో హిమాద్రి- నిఖిత జోడిపై, శ్రావ్య శివాని-శరణ్య షెట్టి జోడి 6-3, 6-2తో ప్రకృతి-రితూజా జాదవ్ జంటపై, కుశ్‌బీన్ కౌర్-రాహ మంగత్ జంట 6-3, 6-2తో ప్రియాంక-బిందు జోడిపై గెలుపొందాయి. -
అండర్-14 విజేత సీసీఓబీ
ముగిసిన బోస్టన్ కప్ క్రికెట్ టోర్నీ బహదూర్‌పురా, న్యూస్‌లైన్: బోస్టన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ అండర్-14 విభాగంలో సీసీఓబీ జట్టు టైటిల్ గెలుచుకుంది. మాసాబ్‌ట్యాంక్‌లోని ఎస్సీఎఫ్ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో సీసీఓబీ, ఎస్సీఎఫ్ గ్రీన్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్సీఎఫ్ గ్రీన్ నిర్ణీత 10 ఓవర్లలో 108 పరుగులు చేయగా...సీసీఓబీ 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అండర్-12, అండర్-16 విభాగాల్లో మాత్రం సీసీఓబీ రన్నరప్‌గా నిలిచింది. అండర్-12 విభాగంల్లో సూపర్ క్యాట్ జట్టు కప్ గెలుచుకుంది. ఫైనల్లో సూపర్ క్యాట్ 10 ఓవర్లలో 3 వికెట్లకు 95 పరుగులు సాధించగా, సీసీఓబీ 65 పరుగులే చేయగలిగింది. అండర్-16 విభాగంలో ఎస్సీఎఫ్ తులసి గెలుపు సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సీసీఓబీని చిత్తు చేసింది. ముందుగా సీసీఓబీ 122 పరుగులు చేయగా...తులసి టీమ్ 2 వికెట్లకు 124 పరుగులు చేసింది. ముజీబ్ 45, బాబీ 38 పరుగులతో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఐపీఎస్ అధికారి ఆవుల రమేశ్ రెడ్డి, మాజీ క్రికెటర్ మోమిన్ పటేల్, ఎస్సీఎఫ్ చైర్మన్ సాయిబాబా, బోస్టన్ కప్ నిర్వాహకులు మొహమ్మద్ షాకీర్ విజేతలకు బహుమతులు అందజేశారు. -
సెమీఫైనల్లో సంస్కృతి
ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఐటా అండర్-14 టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో దామెర సంస్కృతి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేరెడ్మెట్ క్రాస్ రోడ్స్‌లోని రమా టెన్నిస్ అకాడమీలో మంగళవారం బాల, బాలికల సింగిల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ పోటీలు జరిగాయి. బాలికల సింగిల్స్‌లో సంస్కృతి 4-1, 4-2తో సొనాలి జైస్వాల్‌పై అలవోక విజయం సాధించింది. ఇతర సింగిల్స్ మ్యాచ్‌ల్లో సృష్టి 1-4, 4-0 (10/7)తో ఇషికా అగర్వాల్‌పై, తులసీ కార్వార్ 4-1, 4-2తో అనన్య మోహన్‌పై, సాహితి రెడ్డి 4-1, 5-3తో షరాన్ శామ్సన్‌పై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అమన్ ఖాన్ 4-0, 5-3తో రిషిల్ గుప్తాపై, సుహిత్ రెడ్డి 4-1, 5-4 (11/9)తో వల్లభనేని ప్రీతమ్‌పై, శివ అనిరుధ్ 4-1, 4-1తో దీపక్ వాయరపై, సిఖ్ సంచిత్ 4-2, 4-5 (10/6)తో హర్షిత్ కొసరాజుపై గెలుపొందారు. -
విజేత సెయింట్ జాన్స్ అకాడమీ
ఇంటర్ అకాడమీ చాలెంజర్ ట్రోఫీ సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి అండర్-14 ఇంటర్ అకాడమీ క్రికెట్ చాలెంజర్ ట్రోఫీలో నగరానికి చెందిన సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ జట్టు విజేతగా నిలిచింది. తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సెయింట్ జాన్స్ 76 పరుగుల భారీ తేడాతో తిరుప్పూరు స్కూల్ ఆఫ్ క్రికెట్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ జాన్స్ నిర్ణీత 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ప్రగున్ దూబే (50) అర్ధ సెంచరీ చేయగా, వైష్ణవ్ రెడ్డి 25 పరుగులు సాధించాడు. తిరుప్పూరు బౌలర్ రోహన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తిరుప్పూరు స్కూల్ 75 పరుగులకే కుప్పకూలింది. సెయింట్ జాన్స్ బౌలర్లు రిషభ్ బస్లాస్ (2/9), సిద్ధార్థ్ నాయుడు (2/10) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో ‘ఎ’ గ్రూప్‌లో సెయింట్ జాన్స్ ఆడిన 3 మ్యాచ్‌లూ నెగ్గి అజేయంగా నిలవడం విశేషం. సెమీఫైనల్లో ఈ జట్టు 104 పరుగుల తేడాతో ముత్తూట్ క్రికెట్ అకాడమీ (కొచ్చి)ని చిత్తు చేసింది. ఈ అకాడమీకి చెందిన సిద్ధార్థ్ నాయుడు (బెస్ట్ బ్యాట్స్‌మన్), రిషభ్ బస్లాస్ (బెస్ట్ బౌలర్), ప్రియాన్షు జైన్ (ప్రామిసింగ్ బౌలర్), ప్రగున్ దూబే (బెస్ట్ కీపర్) వ్యక్తిగత విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నారు. -
క్వార్టర్స్‌లో సాయిదేదీప్య
ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయిదేదీప్య ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నీలో మెరిసింది. పుణెలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు, డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సింగిల్స్‌లో ఓడిన మరో ఏపీ అమ్మాయి శ్రీవల్లి రష్మిక డబుల్స్‌లో సెమీస్‌కు చేరింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సాయిదేదీప్య 6-3, 6-1తో పాన్య భల్లాపై, రాష్ట్రానికి చెందిన ఐదో సీడ్ అమినేని శివాని 6-3, 6-3తో ఆద్యా చల్లాపై గెలుపొందారు. శ్రీవల్లి 1-6, 2-6తో ఏడో సీడ్ ప్రకృతి భన్వాని చేతిలో ఓడింది. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి-పాన్య భల్లా జోడి 6-1, 7-5తో నేహా గరే- శరణ్య జంటపై విజయం సాధించగా, సాయిదేదీప్య-ఈశ్వరి మాత్రే జంట 6-4, 6-1తో శ్రేయ సగాడే-రుతూజ జాదవ్ ద్వయాన్ని ఓడించింది. అమినేని శివాని-ఇషితా పరేఖ్ జోడి 6-4, 6-0తో నేహ మొకాషి- పరాడే జంటపై గెలిచింది. -
తనిష్క్‌కు రన్నరప్
రాయదుర్గం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ విద్యార్థి తనిష్క్ మాల్పాని సత్తాచాటాడు. ఇటీవల అణుపురం టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో అతను బాలుర అండర్-14 విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తనిష్క్ టైటిల్ పోరులో పరాజయం చవిచూశాడు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తనిష్క్, కోచ్ డేవిడ్ రాజ్‌కుమార్‌లను ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్‌సేన్ బజాజ్, వైస్ ప్రిన్సిపల్ హేమ చెన్నుపాటి అభినందించారు. -
టెన్నిస్ చాంప్ హర్షిత్
జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో బాలుర అండర్-12 విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు హర్షిత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. బోయిన్‌పల్లిలో సూర్య టెన్నిస్ అకాడమీ నిర్వహించిన ఈ టోర్నీలో శనివారం జరిగిన ఫైనల్లో హర్షిత్ 6-3, 0-6, 6-1తో ప్రీతమ్‌పై విజయం సాధించాడు. బాలికల విభాగంలో సంస్కృతి (ఏపీ) 6-4, 6-0తో సాహితి రెడ్డిని ఓడించి ంది. బాలుర అండర్-14 విభాగంలో అనికేత్ (ఆంధ్రప్రదేశ్) 6-2, 6-3తో సాయి కార్తీక్ (ఏపీ)పై, బాలికల విభాగంలో శ్రావ్య శివాని (ఏపీ) 6-1, 6-1తో ఉమర్ మిష్గాన్ (ఏపీ)పై గె లిచింది. అండర్-12 బాలుర డబుల్స్ విభాగంలో ఆదర్శ్-అనురాగ్ అగర్వాల్ జోడి 6-4, 4-6, 6-4తో హర్షిత్-ఆకాష్ జోడిపై నెగ్గింది. అండర్-14 బాలికల విభాగంలో చరిత-లిపిక జోడి 6-4, 4-6, 10-5తో సాహితి రెడ్డి- అనన్య మోహన్ జోడిపై గెలుపొందింది. -
భారత జట్టు పరాజయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌లో నెగ్గినా... ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్ (అండర్-14) టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రాస్టెజోవ్లో ఈ టోర్నీ జరుగుతోంది. టోర్నమెంట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో కెనడా 2-1 తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రాంజల 3-6, 6-2, 7-5 స్కోరుతో కాథరీన్ సెబోవ్‌పై విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో భారత అమ్మాయి మిహికా యాదవ్ 2-6, 4-6తో వనీసా వాంగ్ చేతిలో ఓటమిపాలైంది. డబుల్స్ మ్యాచ్‌లో ప్రాంజల-మిహికా జోడి 3-6, 2-6 స్కోరుతో వనీసా వాంగ్-చార్లొట్ రాబిలార్డ్ చేతిలో పరాజయం ఎదుర్కొంది. తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో భారత్... స్పెయిన్‌తో తలపడుతుంది. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు లీగ్ స్థాయిలో మూడు మ్యాచ్‌లు ఆడి పాయింట్ల ప్రకారం నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది.