తనిష్క్‌కు రన్నరప్ | tanishq in runner-up position open tennis tournment | Sakshi
Sakshi News home page

తనిష్క్‌కు రన్నరప్

Published Wed, Apr 16 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

tanishq in runner-up position open tennis tournment

రాయదుర్గం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ విద్యార్థి తనిష్క్ మాల్‌పాని సత్తాచాటాడు. ఇటీవల అణుపురం టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో అతను బాలుర అండర్-14 విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తనిష్క్ టైటిల్ పోరులో పరాజయం చవిచూశాడు.
 
 ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తనిష్క్, కోచ్ డేవిడ్ రాజ్‌కుమార్‌లను ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్‌సేన్ బజాజ్, వైస్ ప్రిన్సిపల్ హేమ చెన్నుపాటి అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement