అదే నా కోరిక : సానియా మీర్జా | sania mirza wants starts the own tennis academy | Sakshi
Sakshi News home page

అదే నా కోరిక : సానియా మీర్జా

Published Tue, Jul 25 2017 6:00 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

అదే నా కోరిక : సానియా మీర్జా

అదే నా కోరిక : సానియా మీర్జా

హైదరాబాద్‌సిటీ: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన కోరికను వెలిబుచ్చారు. సొంత టెన్నిస్‌ అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది తన కోరిక అని సానియా అన్నారు. నగరంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ నేహ దూపియా, సానియా మీర్జా సందడి చేశారు. సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీలో బాలీవుడ్‌ పాటలపై అదరగొట్టే స్టెప్పులు వేశారు. వరల్డ్ టెన్నిస్ అసోషియేషన్ నిర్వహించే టోర్నమెంట్ ప్రమోషన్‌లో భాగంగా సానియా పిల్లలతో కలిసి టెన్నిస్ ఆడారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహిళల ప్రపంచకప్‌ క్రికెట్‌లో భారత మహిళల జట్టు చాలా మంచి ప్రదర్శన కనపరిచిందని.. కాకపోతే ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం కొంత నిరాశ పరిచిందన్నారు. కానీ వారి పోరాటం స్పూర్తినిస్తుందన్నారు. ఇక దేశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఆటలో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారని, భవిష్యత్తులో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందరిని ఒకే రకంగా చూసే రోజులు రావాలన్నదే తన కోరిక అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement