సెమీస్‌లో శివాని | shivani enters in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శివాని

Published Fri, Jun 13 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

shivani enters in semi finals

ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్
 సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి అమినేని శివాని సత్తాచాటింది. చండీగఢ్‌లోని సీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో రెండో సీడ్ శివాని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మిగతా సహచరులు శ్రీవల్లి రష్మిక, టాప్ సీడ్ సాయిదేదీప్య నిరాశపరిచారు. క్వార్టర్స్‌లోనే కంగుతిన్నారు. డబుల్స్‌లో సాయిదేదీప్య-మహక్ జైన్ జోడి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శివాని 7-5, 6-3తో ఎనిమిదో సీడ్ ఈశ్వరి మాటెరేపై నెగ్గింది. శివాని 3-6, 1-6తో నాలుగో సీడ్ మహక్ జైన్ చేతిలో, సాయి దేదీప్య 5-7, 7-5, 4-6తో ఆరో సీడ్ ప్రింకిల్ సింగ్ చేతిలో పరాజయం చవిచూశారు.
 
  దేదీప్య తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది. డబుల్స్ ఈవెంట్‌లో మహక్ జైన్‌తో జతకట్టిన సాయిదేదీప్య 6-1, 6-1తో ఈశ్వరి మాటెరే-అయేషా పటేల్ జంటపై అలవోక విజయం సాధించింది. శ్రీవల్లి రష్మిక-పాన్యభల్లా ద్వయం 6-2, 6-1తో అశ్‌ప్రీత్ కౌర్-తనీషా బన్సాల్ జంటపై, శ్రావ్యశివాని-శరణ్యషెట్టి జోడి 6-0, 6-2తో నికితాదేవి-ప్రిన్సీ పాంచాల్ ద్వయంపై, శివాని-ప్రింకిల్ సింగ్ జంట 6-1, 6-2తో కుశ్‌బీన్ కౌర్-రాహమంగత్ జోడిపై గెలుపొందాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement