సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌లో నెగ్గినా... ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్ (అండర్-14) టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రాస్టెజోవ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. టోర్నమెంట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో కెనడా 2-1 తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రాంజల 3-6, 6-2, 7-5 స్కోరుతో కాథరీన్ సెబోవ్‌పై విజయం సాధించింది.
రెండో సింగిల్స్‌లో భారత అమ్మాయి మిహికా యాదవ్ 2-6, 4-6తో వనీసా వాంగ్ చేతిలో ఓటమిపాలైంది. డబుల్స్ మ్యాచ్‌లో ప్రాంజల-మిహికా జోడి 3-6, 2-6 స్కోరుతో వనీసా వాంగ్-చార్లొట్ రాబిలార్డ్ చేతిలో పరాజయం ఎదుర్కొంది. తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో భారత్... స్పెయిన్‌తో తలపడుతుంది. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు లీగ్ స్థాయిలో మూడు మ్యాచ్‌లు ఆడి పాయింట్ల ప్రకారం నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది.
భారత జట్టు పరాజయం
Published Wed, Aug 7 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement