ఇంటర్ అకాడమీ చాలెంజర్ ట్రోఫీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి అండర్-14 ఇంటర్ అకాడమీ క్రికెట్ చాలెంజర్ ట్రోఫీలో నగరానికి చెందిన సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ జట్టు విజేతగా నిలిచింది. తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సెయింట్ జాన్స్ 76 పరుగుల భారీ తేడాతో తిరుప్పూరు స్కూల్ ఆఫ్ క్రికెట్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ జాన్స్ నిర్ణీత 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ప్రగున్ దూబే (50) అర్ధ సెంచరీ చేయగా, వైష్ణవ్ రెడ్డి 25 పరుగులు సాధించాడు.
తిరుప్పూరు బౌలర్ రోహన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తిరుప్పూరు స్కూల్ 75 పరుగులకే కుప్పకూలింది. సెయింట్ జాన్స్ బౌలర్లు రిషభ్ బస్లాస్ (2/9), సిద్ధార్థ్ నాయుడు (2/10) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో ‘ఎ’ గ్రూప్‌లో సెయింట్ జాన్స్ ఆడిన 3 మ్యాచ్‌లూ నెగ్గి అజేయంగా నిలవడం విశేషం. సెమీఫైనల్లో ఈ జట్టు 104 పరుగుల తేడాతో ముత్తూట్ క్రికెట్ అకాడమీ (కొచ్చి)ని చిత్తు చేసింది. ఈ అకాడమీకి చెందిన సిద్ధార్థ్ నాయుడు (బెస్ట్ బ్యాట్స్‌మన్), రిషభ్ బస్లాస్ (బెస్ట్ బౌలర్), ప్రియాన్షు జైన్ (ప్రామిసింగ్ బౌలర్), ప్రగున్ దూబే (బెస్ట్ కీపర్) వ్యక్తిగత విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నారు.
విజేత సెయింట్ జాన్స్ అకాడమీ
Published Mon, Apr 28 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement
Advertisement